NarayanaNiNamameGatiYika

నారాయణ నీ నామమెగతి యిక
కొర్కెలు నాకు కొనసాగుటకు


పైపై ముందట భవజలధి
దాపు వెనక చింతా జలధి
చాపలము నడుమ సంసార జలధి
తేపయేది యిది తెగనీదుటకు

పండె నెడమ పాపపు రాశి
అండ గుడిని పుణ్యపు రాశి
కొండను నడుమ త్రిగుణ రాశి
నిండ కుడుచుటకు నిలుకడ యేది

కింది లోకములు కీడు నరకములు
అందెటి స్వర్గాలవె మీద
చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ
యందె పరమపద మవల మరేది


Get this widget | Track details | eSnips Social DNA