pAladoMga vadda vacci pADEru



ప|| పాలదొంగ వద్ద వచ్చి పాడేరు తమ-
పాలిటిదైవమని బ్రహ్మాదులు

చ|| రోల గట్టించుక పెద్దరోలలుగా వాపోవు
బాలునిముందర వచ్చి పాడేరు
ఆలకించి వినుమని యంబరభాగమునందు
నాలుగుదిక్కులనుండి నారదాదులు

చ|| నోరునిండా జొల్లుగార నూగి ధూళిమేనితో
పారేటిబిడ్డనివద్ద బాడేరు
వేరులేనివేదములు వెంటవెంట జదువుచు
జేరిచేరి యింతనంత శేషాదులు

చ|| ముద్దులు మోమునగార మూలలమూలలదాగె-
బద్దులబాలునువద్ద బాడేరు
అద్దివో శ్రీతిరువేంకటాద్రీశు డితడని
చద్దికి వేడికి వచ్చి సనకాదులు



pa: pAladoMga vadda vacci pADEru tama-

pAliTidaivamani brahmAdulu

ca: rOla gaTTiMcuka peddarOlalugA

vApOvu bAlunimuMdara vacci pADEru

AlakiMci vinumani yaMbaraBAgamunaMdu

nAlugudikkulanuMDi nAradAdulu

ca: nOruniMDA jollugAra nUgi dhULimEnitO

pArETibiDDanivadda bADEru

vErulEnivEdamulu veMTaveMTa jaduvucu

jEricEri yiMtanaMta SEShAdulu

ca: muddulu mOmunagAra mUlalamUlaladAge-

baddulabAlunuvadda bADEru addivO

SrItiruvEMkaTAdrISu DitaDani

caddiki vEDiki vacci sanakAdulu




Sung by:Balakrishna Prasad