malasI jUDarO magasiMhamu - మలసీ జూడరో మగసింహము

ప|| మలసీ జూడరో మగసింహము | అలవి మీరిన మాయల సింహము ||
చ|| అదివో చూడరో ఆదిమ పురుషుని | పెద యౌబళముమీది పెనుసింహము |
వెదికి బ్రహ్మాదులు వేదాంతతతులు | కదిసి కానగ లేని ఘనసింహము ||
చ|| మెచ్చి మెచ్చి చూడరో మితిమీరినయట్టి | చిచ్చరకంటితోడి జిగిసింహము |
తచ్చిన వారిధిలోని తరుణిగౌగిటజేర్చి | నచ్చిన గోళ్ళ శ్రీ నరసింహము ||
చ|| బింకమున జూడరో పిరితీయక నేడు | అంకపుదనుజ సంహార సింహము |
వేంకటనగముపై వేదాచలముపై | కింకలేక వడి బెరిగిన సింహము ||


pa|| malasI jUDarO magasiMhamu | alavi mIrina mAyala siMhamu ||
ca|| adivO cUDarO Adfima puruShuni | peda yaubaLamumIdi penusiMhamu |
vediki brahmAdulu vEdAMtatatulu | kadisi kAnaga lEni GanasiMhamu ||
ca|| mecci mecci cUDarO mitimIrinayaTTi | ciccarakaMTitODi jigisiMhamu |
taccina vAridhilOni taruNigaugiTajErci | naccina gOLLa SrI narasiMhamu ||
ca|| biMkamuna jUDarO piritIyaka nEDu | aMkapudanuja saMhAra siMhamu |
vEMkaTanagamupai vEdAcalamupai | kiMkalEka vaDi berigina siMhamu ||



Sung by:SP Balasubrahmanyam

marigi vIrepO mAdaivaMbulu - మరిగి వీరెపో మాదైవంబులు

ప|| మరిగి వీరెపో మాదైవంబులు | కెరలిన హరిసంకీర్తనపరులు ||
చ|| వినియెడివీనులు విష్ణుకథలకే | పనిగొందురు మాప్రపన్నులు |
కనియెడి కన్నులు కమలాక్షునియం- | దనువుపరతు రటు హరిసేవకులు ||
చ|| పలికెడి పలుకులు పరమాత్మునికై | యలవరుతురు శరణాగతులు |
తలచేటి తలపులు ధరణీధరుపై | తలచెడి రతిదివ్యులు ||
చ|| కరముల శ్రీపతికైంకర్యములే | మురియుచు జేతురు ముముక్షువులు |
యిరవుగ శ్రీవేంకటేశ్వరుమతమే | సిరుల నమ్ముదురు శ్రీవైష్ణవులు ||


pa|| marigi vIrepO mAdaivaMbulu | keralina harisaMkIrtanaparulu ||
ca|| viniyeDivInulu viShNukathalakE | panigoMduru mAprapannulu |
kaniyeDi kannulu kamalAkShuniyaM- | danuvuparatu raTu harisEvakulu ||
ca|| palikeDi palukulu paramAtmunikai | yalavaruturu SaraNAgatulu |
talacETi talapulu dharaNIdharupai | talaceDi ratidivyulu ||
ca|| karamula SrIpatikaiMkaryamulE | muriyucu jEturu mumukShuvulu |
yiravuga SrIvEMkaTESvarumatamE | sirula nammuduru SrIvaiShNavulu ||



Sung by:Priya Sisters

miMchi dEvAMganaliTTe - మించి దేవాంగనలిట్టె


మించి దేవాంగనలిట్టె మెచ్చేరమ్మ
యెంచ నలమేల్మంగ యెంతదానవమ్మా

మాటలనే వూరడించి మచ్చికల పొద్దు వుచ్చి
నీటున పతిని తేలించ నేరుతువమ్మ
పాటలనే కరగించి పంతముల మరిగించి
చాటునను ఆతని గూడా జాణవమ్మా

నగుతానే రప్పించి నటనల మెప్పించి
తగుపతి దక్కగొన దంటవమ్మా
పగటుల భ్రమయించి బడినుండే వలపించి
చిగిరించ జేయ పతిచిత్తము వత్తువమ్మా

కాగిటనే చొక్కించి కందువల మొక్కించి
ఆగి పతివురమెక్కేవు అప్పుడే యమ్మ
పాగిన శ్రీవేంకటేశు పట్టపు రాణివి నీవు
నీగని వేడుకతోడ నీవారమమ్మా


miMchi dEvAMganaliTTe mechchEramma
yeMcha nalamElmaMga yeMtadAnavammA

mATalanE vUraDiMchi machchikala poddu vuchchi
nITuna patini tEliMcha nErutuvamma
pATalanE karagiMchi paMtamula marigiMchi
chATunanu Atani gUDA jANavammA

nagutAnE rappiMchi naTanala meppiMchi
tagupati dakkagona daMTavammA
pagaTula bhramayiMchi baDinuMDE valapiMchi
chigiriMcha jEya patichittamu vattuvammA

kAgiTanE chokkiMchi kaMduvala mokkiMchi
Agi pativuramekkEvu appuDE yamma
pAgina SrIvEMkaTESu paTTapu rANivi nIvu
nIgani vEDukatODa nIvAramammA


Sung by:Balakrishna Prasad

mataMga parvatamu mAlya - మతంగ పర్వతము మాల్య

మతంగ పర్వతము మాల్యవంతము నడుమ
సతమై శ్రీవేంకటేశ్వరుడున్నవాడు

కొలిచినవారకెల్లా కోరినవరములిచ్చి
తలచినవారినెల్లా ధన్యులజేసి
పొలుపుమిగుల మంచి పువ్వులతోటలనీడ
విలసిల్లీనదివో శ్రీవేంకటేశ్వరుడు

శరణన్నవారికి చనవిచ్చి రక్షించి
గరిమ పూజించువారి కరుణ జూచి
పరిపూర్ణమగు తుంగభద్రాతటామునందు
విరివిగొన్నాడు శ్రీవేంకటేశ్వరుడు

తనునమ్మినవారికి తగినసంపదలిచ్చి
కనినుతించేవారికి కామధేనువై
కనకమయములైన ఘనమైనమేడలలో
వినుతికెక్కెను శ్రీవేంకటేశ్వరుడు


mataMga parvatamu mAlyavaMtamu naDuma
satamai SrIvEMkaTESwaruDunnavADu

kolichinavArakellA kOrinavaramulichchi
talachinavArinellA dhanyulajEsi
polupumigula maMchi puvvulatOTalanIDa
vilasillInadivO SrIvEMkaTESwaruDu

SaraNannavAriki chanavichchi rakshiMchi
garima pUjiMchuvAri karuNa jUchi
paripUrNamagu tuMgabhadrAtaTAmunaMdu
virivigonnADu SrIvEMkaTESwaruDu

tanunamminavAriki taginasaMpadalichchi
kaninutiMchEvAriki kAmadhEnuvai
kanakamayamulaina ghanamainamEDalalO
vinutikekkenu SrIvEMkaTESwaruDu



Sung by:Priya Sisters

maMdaradhara madhusUdana - మందరధర మధుసూదన





ప మందరధర మధుసూదన నందగోపనందనా
చ నరసింహ గోవింద నవనీతానంద హరిముకుంద నయనారవింద
కరివరద గరుడగమనరూప- గురుచాపా యదుకులదీపా
చ భవదూర భయహర పరిపూర్ణామౄత భువనపాలన సురపాలన
భువనభూషణ పరమపురుష పురాతన నవభోగా కరుణాయోగా
చ పంకజాసననుత భవ్యనిర్మలపాద- పంకజ పరమ పరాత్పర
వేంకటశైలనివేశ శు- భంకరా క్షేమంకరా


pa maMdaradhara madhusUdana naMdagOpanaMdanA
ca narasiMha gOviMda navanItAnaMda harimukuMda nayanAraviMda

karivarada garuDagamanarUpa- gurucApA yadukuladIpA

ca BavadUra Bayahara paripUrNAmRuta BuvanapAlana surapAlana

BuvanaBUShaNa paramapuruSha purAtana navaBOgA karuNAyOgA

ca paMkajAsananuta BavyanirmalapAda- paMkaja parama parAtpara

vEMkaTaSailanivESa Su- BaMkarA kShEmaMkarA



Get this widget | Track details | eSnips Social DNA

meccenoka rAgaMbu - మెచ్చెనొక రాగంబు






ప|| మెచ్చెనొక రాగంబు మీద మీద కడు | నిచ్చె నొక రాగంబు యింతులకు నెల్ల ||

చ|| చేసె నొక రాగంబు చెలియెదుట గన్నులనె | మూసె నొక రాగంబు ముదిత మతినె |
పూసె నొక రాగంబు పొలతి పులకలమేన | వ్రాసె నొక రాగంబు వనిత నినుబాసి ||

చ|| పట్టె నొక రాగంబు ప్రాణములపై నలిగి | తిట్టె నొక రాగంబు తిరిగి తిరిగి |
పుట్టె నొక రాగంబు పొలతి డెందమునకును | మెట్టె నొక రాగంబు మెరయుచునె కదలి ||

చ|| కురిసె నొక రాగంబు కొప్పు పువ్వులనె సతి | మురిసె నొక రాగంబు ముంచి మేన |
తిరువేంకటేశ్వరుడ తెలిసికో నినుబొంది | పొరసె నొక రాగంబు పొలతి కుచములనే ||

pa|| meccenoka rAgaMbu mIda mIda kaDu | nicce noka rAgaMbu yiMtulaku nella ||

ca|| cEse noka rAgaMbu celiyeduTa gannulane | mUse noka rAgaMbu mudita matine |
pUse noka rAgaMbu polati pulakalamEna | vrAse noka rAgaMbu vanita ninubAsi ||

ca|| paTTe noka rAgaMbu prANamulapai naligi | tiTTe noka rAgaMbu tirigi tirigi |
puTTe noka rAgaMbu polati DeMdamunakunu | meTTe noka rAgaMbu merayucune kadali ||

ca|| kurise noka rAgaMbu koppu puvvulane sati | murise noka rAgaMbu muMci mEna |
tiruvEMkaTESvaruDa telisikO ninuboMdi | porase noka rAgaMbu polati kucamulanE ||



MECHCHENOKA RAAGAMBU(YOUTUBE)
MECHCHENOKA RAAGAM...
Hosted by eSnips

mariyu mariyu palumAru - మరియు మరియు పలుమారు

మరియు మరియు పలుమారు నీకే శరణు
అరిమురి సకలాంతర్యామీ శరణు

సరుస మూర్తిత్రయశరీరానికి శరణు
నిరుపమ పంచభూతనిలయా శరణూ
పురిగొన్న చరుత్దశ భువనాధారా శరణు
గరిమెనింతకు మూలకారణమా శరణు

పలుకగరాని పరబ్రహ్మమా నీకే శరణు
అలవి మీఱినయట్టి కాలాత్మకా శరణు
విలసిల్ల బొడచూపే విశ్వరూపమా శరణు
సలలిత బ్రహ్మాండజనకా శరణు

దినకర కోటికోటి తేజమా నీకే శరణు
సనకాది యోగీంద్ర సన్నుతా శరణు
మనికైన అలమేలుమంగ విభుడా శరణు
ననుగాచే శ్రీవేంకటనాయకా శరణు


mariyu mariyu palumAru nIkE SaraNu
arimuri sakalAMtaryAmI SaraNu

sarusa mUrtitrayaSarIrAniki SaraNu
nirupama paMchabhUtanilayA SaraNU
purigonna charutdaSa bhuvanAdhArA SaraNu
garimeniMtaku mUlakAraNamA SaraNu

palukagarAni parabrahmamA nIkE SaraNu
alavi mI~rinayaTTi kAlAtmakA SaraNu
vilasilla boDachUpE viSwarUpamA SaraNu
salalita brahmAMDajanakA SaraNu

dinakara kOTikOTi tEjamA nIkE SaraNu
sanakAdi yOgIMdra sannutA SaraNu
manikaina alamElumaMga vibhuDA SaraNu
nanugAchE SrIvEMkaTanAyakA SaraNu


Download Link