paluku tenela thalli - పలుకు దేనెల తల్లి

పలుకు దేనెల తల్లి పవళించెను
కలికి తనముల విభుని గలసినది గాన

నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళించెను
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన

కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బంగారు మేడపై బవళించెను
చెంగలువ కనుగొనల సింగారములు దొలుగ
అంగజ గురునితోడ నలసినది గాన

మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున దరుణి పవళించెను
తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి
అరవిరై యూరుల జెమట యంటినది గాన


pasidi akshanthalive - పసిడి యక్షంతలివె

పసిడియక్షంతలివె పట్టరో వేగమె రారో
దెసల పేరంటాండ్లు దేవుని పెండ్లికిని

శ్రీవేంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి
దైవికపు పెండ్లిముహూర్తము నేడు
కావించి భేరులు మ్రోసె గరుడధ్వజంబెక్కె
దేవతలు రారో దేవుని పెండ్లికిని

కందర్ప జనకునకి కమలాదేవికి
పెండ్లిపందిలిలోపల తలంబాలు నేడు
గంధమూ విడెమిచ్చేరు కలువడాలు గట్టిరి
అందుక మునులు రారో హరి పెండ్లికిని

అదె శ్రీ వేంకటపతికి అలమేలు మంగకును
మొదలి తిరుణాళ్ళకు మ్రొక్కేము నేడు
యెదుట నేగేరు వీరెయిచ్చేరు వరములివె
కదలిరారో పరుష ఘనుల పెండ్లికిని


poDagaMTimayya mimmu - పొడగంటిమయ్య మిమ్ము

పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు
చేరువజిత్తములోని శ్రీనివాసుడా

భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము
చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా
లడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా

poDagaMTimayya mimmu purushOttamaa mammu
neDayakavayya kOnaeTi raayaDaa

kOrimammu naelinaTTi kuladaivamaa, chaala
naerichi peddalichchina nidhaanamaa
gaaraviMchi dappideerchu kaalamaeghamaa, maaku
chaeruvajittamulOni SreenivaasuDaa

bhaaviMpa gaivasamaina paarijaatamaa, mammu
chaevadaera gaachinaTTi chiMtaamaNee
kaaviMchi kOrikalichchae kaamadhaenuvaa, mammu
taavai rakshiMchaeTi dharaNeedharaa

cheDaneeka bratikiMchae siddhamaMtramaa, rOgaa
laDachi rakshiMchae divyaushadhamaa
baDibaayaka tirigae praaNabaMdhuDaa, mammu
gaDiyiMchinaTTi Sree vaeMkaTanaathuDaa



puttu bhogulamu memu - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

పుట్టుభోగులము మేము భువి హరి దాసులము
నట్టనడిమి దొరలు నాకీయవలెనా? ॥౩॥

పల్లకీలు అందలాలు, పడివాగే తేదీలూ
పెళ్ళి విరి మహాలక్ష్మీవిలాసములు
తల్లిఆకే మగని దైవమని కొలిచేము
ఒల్లగె మాకే సిరులు ఒరులీయవలెనా? పుట్టు॥

గ్రామములు, రత్నములు గజముఖ్య వస్తువులు
ఆమని భూకాంతకు అంగభేధాలు
భామిని ఆకే మగనిని ప్రాణధారి లెంకలము
ఓమిమతడే ఇచ్చె ఒరులీయవలెనా పుట్టు॥

పసగల పదవులు బ్రహ్మానిర్మితములు
వెసబ్రహ్మ తండ్రి శ్రీవేంకటేశుడు
వెసగి ఆతడే మమ్ము ఏలీఇన్నియునిచ్చె
ఒసగిన మా సొమ్ములు ఒరులీయవలెనా పుట్టు॥



Get this widget | Track details | eSnips Social DNA

PidikitaTalambrala - mp3 - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత
పడమరలి నవీనె పెండ్లి కూతురు


పేరుకల జవరాలె పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు

పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరుకుచ్చు సిగ్గువడీ పెండ్లి కూతురు


బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర
బిరుదు మగని కంటె బెండ్లి కూతురు

పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి
బెరరేచీ నిదివో పెండ్లి కూతురు


పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె
పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు

గట్టిగ వేంకటపతి కౌగిటను
పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు



Get this widget | Track details | eSnips Social DNA

paramaatmuDaina hari - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు
ధరమము విచారించ తగునీకు అమ్మ


కమలజుగన్న తల్లివి కామునిగన్న తల్లి
అమరులగన్న తల్లి ఆదిమ లక్ష్మి

విమలపు నీ పతికి విన్నపము జేసి మమ్ము
నెమకి ఏలితి దయ నీకే తగునమ్మ


కామధేను తోబుట్టుగ కల్పకము తోబుట్టుగ
దోమటి చల్లిన చంద్రుతో బుట్టుగ

నీమగని పంపునను నిజసిరులిచ్చితివి
నేమపు వితరణము నీకే తగునమ్మ


పాలజలధి కన్యపు పద్మాసినివి నీవు
పాలపండే శ్రీవేంకటపతి దేవివి

ఏలిన యితని బంట్లకు యిహపరాలిచ్చి మా
పాల గలిగితివి సంబంధము మేలమ్మ

paramaatmuDaina hari paTTapuraaNivi neevu
dharamamu vichaariMcha taguneeku amma

kamalajuganna tallivi kaamuniganna talli
amarulaganna talli aadima lakshmi
vimalapu nee patiki vinnapamu jaesi mammu
nemaki aeliti daya neekae tagunamma

kaamadhaenu tObuTTuga kalpakamu tObuTTuga
dOmaTi challina chaMdrutO buTTuga
neemagani paMpunanu nijasirulichchitivi
naemapu vitaraNamu neekae tagunamma

paalajaladhi kanyapu padmaasinivi neevu
paalapaMDae SreevaeMkaTapati daevivi
aelina yitani baMTlaku yihaparaalichchi maa
paala galigitivi saMbaMdhamu maelamma



Get this widget | Track details | eSnips Social DNA



Sung by:Balakrishna Prasad

Get this widget | Track details | eSnips Social DNA

purushOttamuDa neevu - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను
ధరలో నాయందు మంచితన మేది

అనంతాపరాధములు అటు నేము సేసేవి
అనంతమయినదయ అది నీది
నిను నెఱగకుండేటినీచగుణము నాది
నను నెడయకుండేగుణము నీది

సకలయాచకమే సరుస నాకు బని
సకలరక్షకత్వము సరి నీపని
ప్రకటించి నిన్ను దూరేపలుకే నా కెప్పుడూను
వెకలివై ననుగాచేవిధము నీది

నేర మింతయును నాది నేరు పింతయును నీది
సారెకు నజ్ఞాని నేను జ్ఞానిని నీవు
యీరీతి శ్రీ వేంకటేశ యిట్టే నన్ను నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపము నీది

purushOttamuDa neevu purushaadhamuDa naenu
dharalO naayaMdu maMchitana maedi

anaMtaaparaadhamulu aTu naemu saesaevi
anaMtamayinadaya adi needi ninu
ne~ragakuMDaeTineechaguNamu naadi
nanu neDayakuMDaeguNamu needi

sakalayaachakamae sarusa naaku
bani sakalarakshakatvamu sari neepani
prakaTiMchi ninnu dooraepalukae naa keppuDoonu
vekalivai nanugaachaevidhamu needi

naera miMtayunu naadi naeru piMtayunu needi
saareku naj~naani naenu j~naanini neevu
yeereeti Sree vaeMkaTaeSa yiTTae nannu naelitivi
dhaaruNilO niMDenu prataapamu needi




Sung by:Nedunuri

Get this widget | Track details | eSnips Social DNA