palu vicAramulEla - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

ప|| పలువిచారములేల పరమాత్మ నీవునాకు | కలవుకలవు ఉన్న కడమలేమిటికి ||

చ|| నీపాదముల చెంత నిబిడమైతే చాలు | ఏపాతకములైన యేమి సేసును |
ఏపార నీభక్తి ఇంతగలిగిన చాలు | పైపై సిరిలచ్చట పాదుకొని నిలుచు ||

చ|| సొరిదినీ శరణము జొచ్చితినంటే చాలు | కరుణించి యప్పుడట్టే కాతువునీవు |
సరుస నీముద్రలు భుజములనుంటే చాలు | అరుదుగా చేతనుండు అఖిలలోకములు ||

చ|| నేరకవేసిన చాలు నీమీద పువ్వు | కోరిన కోరికలెల్ల కొనసాగును |
మేరతో శ్రీవేంకటేశ నిన్నుగొలిచితి నేను | ఏరీతినుండిన గాని యిన్నిటా ఘనుడను ||


pa|| paluvicAramulEla paramAtma nIvunAku | kalavukalavu unna kaDamalEmiTiki ||

ca|| nIpAdamula ceMta nibiDamaitE cAlu | EpAtakamulaina yEmi sEsunu |
EpAra nIBakti iMtagaligina cAlu | paipai sirilaccaTa pAdukoni nilucu ||

ca|| soridinI SaraNamu joccitinaMTE cAlu | karuNiMci yappuDaTTE kAtuvunIvu |
sarusa nImudralu BujamulanuMTE cAlu | arudugA cEtanuMDu aKilalOkamulu ||

ca|| nErakavEsina cAlu nImIda puvvu | kOrina kOrikalella konasAgunu |
mEratO SrIvEMkaTESa ninnugoliciti nEnu | ErItinuMDina gAni yinniTA GanuDanu ||



Sung by:Hyderabad Brothers

PaluVicharamulele - Hyd' Brothers
Hosted by eSnips

Periginadu chudaro - పెరిగినాడు చూడరో


పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు
పరగి నానా విద్యల బలవంతుడు ||

రక్కసుల పాలికి రణరంగ శూరుడు

వెక్కసపు ఏకాంగ వీరుడు
దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు

అక్కజమైనట్టి ఆకారుడు ||

లలిమీరిన యట్టి లావుల భీముడు

బలు కపికుల సార్వభౌముడు

నెలకొన్న లంకా నిర్థూమధాముడు

తలపున శ్రీరాము నాత్మారాముడు ||


దేవకార్యముల దిక్కువరేణ్యుడు
భావింపగల తపః ఫల పుణ్యుడు

శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు
సావధానుడు సర్వశరణ్యుడు ||



periginADu cUDarO pedda hanumaMtuDu

paragi nAnA vidyala balavaMtuDu ||


rakkasula pAliki raNaraMga SUruDu

vekkasapu EkAMga vIruDu
dikkulaku saMjIvi techchina dhIruDu

akkajamainaTTi AkAruDu ||


lalimIrina yaTTi lAvula bhImuDu

balu kapikula sArwabhaumuDu

nelakonna laMkA nirthUmadhAmuDu

talapuna SrIrAmu nAtmArAmuDu ||


dEvakAryamula dikkuvarENyuDu

bhAviMpagala tapa@h phala puNyuDu

SrIvEMkaTESwara sEvAgragaNyuDu

sAvadhAnuDu sarwaSaraNyuDu ||



palumaru uTla - పలుమరు ఉట్ల్ల- Annamayya lyrics

ప|| పలుమరు ఉట్ల్ల పండగను | చిలుకు చిడక్కని చిందగను ||

చ|| ఊళ్ళ వీధుల ఉట్ల కృష్ణుడు | తాళ్ళు తెగిపడ తన్నగను |
పెళ్ళు కఠిల్లు పెఠిళ్ళు చిఠిల్లని | పెళ్ళుగ మ్రోసె పెనురవము ||

చ|| బంగరు బిందెల పాలు పెరుగులు | ముంగిట నెగయుచు మోదగను |
కంగు కళింగు కఠింగు ఖణింగని | రంగు మీర పెనురవములై ||

చ|| నిగ్గగు వేంకట నిలయుడిటు పా | లగ్గలిక పగుల అడువగను |
బగ్గు బగ్గిలని పరమామౄతములు | గుగ్గిలి పదనుగ గురియగను ||

pa|| palumaru uTla paMDaganu | ciluku ciDakkani ciMdaganu ||

ca|| ULLa vIdhula uTla kRShNuDu | tALLu tegipaDa tannaganu |
peLLu kaThillu peThiLLu ciThillani | peLLuga mrOse penuravamu ||

ca|| baMgaru biMdela pAlu perugulu | muMgiTa negayucu mOdaganu |
kaMgu kaLiMgu kaThiMgu KaNiMgani | raMgu mIra penuravamulai ||

ca|| niggagu vEMkaTa nilayuDiTu pA | laggalika pagula aDuvaganu |
baggu baggilani paramAmRutamulu | guggili padanuga guriyaganu ||



pApa puNyamula - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english



ప|| పాపపుణ్యముల పక్వ మిదెరుగను |
నా పాలిటి హరి నమో నమో ||

చ|| మానస వాచక కర్మంబుల |
తానకముగ నీ దాసుడను |
పూని త్రిసంధ్యల భోగ భాగ్యముల |
నానా గతులను నమో నమో ||

చ|| వలనుగ జాగ్రద్స్వప్న సుషుప్తుల |
ఇలలో నీకే హితభటుడ |

వెలుపల లోపల వేళావేళల |
నలినాక్ష నీకె నమో నమో ||

చ|| పుట్టుక తొలుతను పుట్టిన మీదట |
అట్టె నీ శరణాగతుడ |

గట్టిగ శ్రీ వేంకటపై నీకౄప |
నట్ట నడుమైతి నమో నమో ||



pa|| pApapuNyamula pakva mideruganu |
nA pAliTi hari namO namO ||


ca|| mAnasa vAcaka karmaMbula |
tAnakamuga nI dAsuDanu |

pUni trisaMdhyala BOga BAgyamula |
nAnA gatulanu namO namO ||


ca|| valanuga jAgradsvapna suShuptula |
ilalO nIkE hitaBaTuDa |

velupala lOpala vELAvELala |
nalinAkSha nIke namO namO ||



ca|| puTTuka tolutanu puTTina mIdaTa |
aTTe nI SaraNAgatuDa |

gaTTiga SrI vEMkaTapai nIkRupa |
naTTa naDumaiti namO namO ||

Get this widget | Track details | eSnips Social DNA


Sung by:Bombay sisters
PapaPunyamula_Bombaysis
Hosted by eSnips

parama yOgISvarula paddhatiyidi - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english

ప|| పరమ యోగీశ్వరుల పద్ధతియిది | ధరణిలో వివేకులు దలపోసుకొనుట ||
చ|| మొదలనాత్మ జ్ఞానము దెలిసి పిమ్మట | హృదయములోని హరినెరుగుట |
వుదుటైన యింద్రియాల నొడిసి వంచుకొనుట | గుదిగొన్న తనలో కోరికలుడుగుట ||
చ|| తన పుణ్యఫలములు దైవముకొసగుట | పనివడి యతనిపై భక్తి చేసుట |
తనివితో నిరంతర ధ్యాన యోగపరుడౌట | మనసుతో ప్రకృతి సంబంధము మరచుట ||
చ|| నడమ నడమ విఙ్ణానపు కథలు వినుట | చిడిముడినాచార్య సేవసేయుట |
యెడయక శ్రీ వేంకటేశుపై భారమువేసి | కడు వైష్ణవుల కృప గలిగి సుఖించుట ||



pa|| parama yOgISvarula paddhatiyidi | dharaNilO vivEkulu dalapOsukonuTa ||
ca|| modalanAtma ~mNAnamu delisi pimmaTa | hRdayamulOni harineruguTa |
vuduTaina yiMdriyAla noDisi vaMcukonuTa | gudigonna tanalO kOrikaluDuguTa ||
ca|| tana puNyaPalamulu daivamukosaguTa | panivaDi yatanipai Bakti cEsuTa |
tanivitO niraMtara dhyAna yOgaparuDauTa | manasutO prakRti sambaMdhamu maracuTa ||
ca|| naDama naDama vi~mNAnapu kathalu vinuTa | ciDimuDinAcArya sEvasEyuTa |
yeDayaka SrI vEMkaTESupai BAramuvEsi | kaDu vaiShNavula kRupa galigi suKiMcuTa ||




Get this widget | Track details | eSnips Social DNA

PhAlanEtrAnala prabala vidyullatA - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english


ప|| ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా | కేళీ విహార లక్ష్మీనారసింహా ||
చ|| ప్రళయమారుత ఘొర భస్త్రీకాపూత్కార | లలిత నిశ్వాసడోలా రచనయా |
కూలశైలకుంభినీ కుముదహిత రవిగగన- | చలన విధినిపుణ నిశ్చల నారసింహా ||
చ|| వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత- | లవదివ్య పరుష లాలాఘటనయా |
వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ | నవనవప్రియ గుణార్ణవ నారసింహా ||
చ|| దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వి- | కార స్ఫులింగ సంగక్రీడయా |
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ- | కారణ ప్రకట వేంకట నారసింహా ||



pa|| PhAlanEtrAnala prabala vidyullatA | kELI vihAra lakShmInArasiMhA ||
ca|| praLayamAruta Gora BastrIkApUtkAra | lalita niSvAsaDOlA racanayA |
kUlaSailakuMBinI kumudahita ravigagana- | calana vidhinipuNa niScala nArasiMhA ||
ca|| vivaraGanavadana durvidhahasana niShThyUta- | lavadivya paruSha lAlAGaTanayA |
vividha jaMtu vrAtaBuvana magnaukaraNa | navanavapriya guNArNava nArasiMhA ||
ca|| dAruNOjjvala dhagaddhagita daMShTrAnala vi- | kAra sPuliMga saMgakrIDayA |
vairidAnava GOravaMSa BasmIkaraNa- | kAraNa prakaTa vEMkaTa nArasiMhA ||


Get this widget | Track details | eSnips Social DNA

pilla grOvi paTTamaMTU - Top/Popular/Annamayya/annamacarya/spiritual/devotional/traditional/songs/ lyrics/Audio/videos/telugu/english



book:6 kriti:109
ఐవి. సీతాపతిగారి వ్యాఖ్యానం menaing provided by telugubhatki.com

పిల్ల(గ్రోవి పట్టమంటూ( బెరరేచీనీ మా
గొల్లవారి పిల్ల(గ్రోవి కోరో చల్లా

పాడుమంటూ దండెమీటె( బలుమారునుం దా
వేడుక నెవ్వెతెపాట వినవచ్చెనో
వాడలో( జల్లలమ్మే వనిత నింతే శ్రుతి
గూడినే( బాడేటిచల్ల కోరో చల్లా

చేరి నన్ను నాడుమంటా( జెక్కు నొక్కీని తా
గారవాన నెవ్వతాట గనివచ్చెనో
మారుకు మారాడేటి మందవారము మేము
కోరికి నాడేటిచల్ల కోరో చల్లా

కిన్నెర మీటుమంటా( గెలసీని తన్ను(
గిన్నెర మీట్ల నేది గిలిగించెనో
కన్నుల కలికి వేంకటపతిపై వెట్టి
గొన్న కిన్నెరగుబ్బల కోరో చల్లా.


pilla(grOvi paTTamaMTU( berarEchInI mA
gollavAri pilla(grOvi kOrO challA

pADumaMTU daMDemITe( balumArunuM dA
vEDuka nevvetepATa vinavachchenO
vADalO( jallalammE vanita niMtE Sruti
gUDinE( bADETichalla kOrO challA

chEri nannu nADumaMTA( jekku nokkIni tA
gAravAna nevvatATa ganivachchenO
mAruku mArADETi maMdavAramu mEmu
kOriki nADETichalla kOrO challA

kinnera mITumaMTA( gelasIni tannu(
ginnera mITla nEdi giligiMchenO
kannula kaliki vEMkaTapatipai veTTi
gonna kinneragubbala kOrO challA.


Get this widget | Track details | eSnips Social DNA