enni badhalabeTTi - ఎన్ని బాధలబెట్టి

ప : ఎన్ని బాధలబెట్టి యేచెదవు నీవింక యెంతకాలముదాక కర్మమా
మన్నించుమనుచు నీమరుగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా

చ : ప్రతిలేని దురితముల పాలుసేయకనన్ను పాలించవైతివో కర్మమా
తతితోడ నాత్మపరితాపంబు తోడుతను తగులేల చేసితివో కర్మమా
జితకాములకుగాని చేతికిని లోనయి చిక్కవేకాలంబు కర్మమా
మతిహీనులైనట్టి మాకునొక పరిపాటి మార్గంబు చూపవో కర్మమా

చ: అసలనియెడి తాళ్ళ నంటగట్టుకవిధికి నప్పగించితివిగదె కర్మమా
వాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నె చెడనీకువో కర్మమా
కాసుకును గొరగాని గతిలేని పనికిగా కాలూదనీవేల కర్మమా
ఓసరించొక మారు వొయ్యనే వొకరీతి నొల్లనని తలగుమీ కర్మమా

చ: తిరువేంకటాచలాధిపుని మాయలచేత దెసల దిరిగినయట్టి కర్మమా
హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా
వరుస నేనుగుమీదివానిసున్నంబడుగ వచ్చునా నీకిట్ల కర్మమా
పరమపురుషోత్తముని భ్రమతబడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా


pa : enni baadhalabeTTi yaechedavu neeviMka yeMtakaalamudaaka karmamaa
manniMchumanuchu neemarugu jochchitimi maamaaTaalakiMchavO karmamaa

cha : pratilaeni duritamula paalusaeyakanannu paaliMchavaitivO karmamaa
tatitODa naatmaparitaapaMbu tODutanu tagulaela chaesitivO karmamaa
jitakaamulakugaani chaetikini lOnayi chikkavaekaalaMbu karmamaa
matiheenulainaTTi maakunoka paripaaTi maargaMbu choopavO karmamaa

cha: asalaniyeDi taaLLa naMTagaTTukavidhiki nappagiMchitivigade karmamaa
vaasi viDichitimi neevaaramaitimi mammu vanne cheDaneekuvO karmamaa
kaasukunu goragaani gatilaeni panikigaa kaaloodaneevaela karmamaa
OsariMchoka maaru voyyanae vokareeti nollanani talagumee karmamaa

cha: tiruvaeMkaTaachalaadhipuni maayalachaeta desala diriginayaTTi karmamaa
haridaasulaguvaari naadariMtuvugaaka aMta noppiMtuvaa karmamaa
varusa naenugumeedivaanisunnaMbaDuga vachchunaa neekiTla karmamaa
paramapurushOttamuni bhramatabaDi neeviTla baTTabayalaitigaa karmamaa


vorapO merupO - వొరపో మెరుపో


వొరపో మెరుపో వయ్యారమో నీకు
వెరుతుమయ్యా
గోవిందుడా

కపటమో నిజమో కరుణయో కోపమో
ఉపచారమో ఉపతాపమో
నిపుణత తనపై నెయ్యమే చేసేవు
విపరీతము
గోవిందుడా

ననుపో నగవో నయమో ప్రియమో
చనవో చలమో సరసమో
కనుకూరిమియో గయ్యాళితనమో
వెనుతగిలేవు గోవిందుడా

మంకో మరులో మదమో ముదమో
జంకో లంకో జగడమో
శంకలేక నను సరుసనకూడితి
వేంకటగిరి
గోవిందుడా


vorapO merupO vayyAramO nIku
verutumayyA gOviMduDA

kapaTamO nijamO karuNayO kOpamO
upachAramO upatApamO
nipuNata tanapai neyyamE chEsEvu
viparItamu gOviMduDA

nanupO nagavO nayamO priyamO
chanavO chalamO sarasamO
kanukUrimiyO gayyALitanamO
venutagilEvu gOviMduDA

maMkO marulO madamO mudamO
jaMkO laMkO jagaDamO
SaMkalEka nanu sarusanakUDiti
vEMkaTagiri gOviMduDA


evvarivADAgAnu - ఎవ్వరివాడాగాను

ఎవ్వరివాడాగాను యేమందునిందుకు
నవ్వుచు నాలోనిహరి నన్నుగావవే

కోపులరాజులనెల్ల కొలిచి కొన్నాళ్ళు నేను
చూపుడుఁబూట వెట్టితి సొగిసి నేను
యేపున సంసారమున ఇదిగాక కమ్మటాను
దాపుగ తొర్లుఁబూట తగిలించుకొంటిని

మొదల కర్మములకు మోసపోయి యీ బ్రదుకు
కుదువవెట్టితి నే గురి గానక
వెదకి కామునికి విషయములకు నే
అదివో నావయసెల్ల నాహివెట్టితిని

ఇప్పుడే శ్రీవేంకటేశ యీడేర్చి నామనసు
కప్పిన గురుడు నీకు క్రయమిచ్చెను
వొప్పించిరిందరు బలువుడు చేపట్టెననుచు
అప్పులెల్లబాసి నీ సొమ్మైతినేనయ్యా


evvarivADAgAnu yEmaMduniMduku
navvuchu nAlOnihari nannugAvavE

kOpularAjulanella kolichi konnALLu nEnu
chUpuDu@MbUTa veTTiti sogisi nEnu
yEpuna saMsAramuna idigAka kammaTAnu
dApuga torlu@MbUTa tagiliMchukoMTini

modala karmamulaku mOsapOyi yI braduku
kuduvaveTTiti nE guri gAnaka
vedaki kAmuniki vishayamulaku nE
adivO nAvayasella nAhiveTTitini

ippuDE SrIvEMkaTESa yIDErchi nAmanasu
kappina guruDu nIku krayamichchenu
voppiMchiriMdaru baluvuDu chEpaTTenanuchu
appulellabAsi nI sommaitinEnayyA



vADala vADala veMTa - వాడల వాడల వెంట


వాడల వాడల వెంట వసంతము
జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ

కలికి నవ్వులె నీకు కప్పుర ర వసంతము
వలచూపు కలువల వసంతము
కులికి మాటాడినదె కుంకుమ వసంతము
చలమున చల్లె నీపై జాజర జాజర జాజ

కామిని జంకెన నీకు కస్తూరి వసంతము
వాముల మోహము నీటి వసంతము
బూమెల సరసముల పుప్పొడి వసంతము
సామజ గురుడ నీపై జాజర జాజర జాజ

అంగన అధరమిచ్చే అమృత వసంతము
సంగడి శ్రీవేంకటేశ సతిగూడితి
ముంగిటి రతి చెమట ముత్తేల వసంతము
సంగతాయెనిద్దరికి జాజర జాజర జాజ


vADala vADala veMTa vasaMtamu
jADatO challEru nIpai jAjara jAjara jAja

kaliki navvule nIku kappura vasaMtamu
valachUpu kaluvala vasaMtamu
kuliki mATADinade kuMkuma vasaMtamu
chalamuna challe nIpai jAjara jAjara jAja

kAmini jaMkena nIku kastUri vasaMtamu
vAmula mOhamu nITi vasaMtamu
bUmela sarasamula puppoDi vasaMtamu
sAmaja guruDa nIpai jAjara jAjara jAja

aMgana adharamichchE amRta vasaMtamu
saMgaDi SrIvEMkaTESa satigUDiti
muMgiTi rati chemaTa muttEla vasaMtamu
saMgatAyeniddariki jAjara jAjara jAja


tanalOnuMDina hari - తనలోనుండిన హరి

తనలోనుండిన హరిఁ దాగొలువడీ దేహి
యెనలేక శరణంటే నితడే రక్షించును

కోరి ముదిమి మానుపుకొనేయాస మందులంటా
వూరకే చేదులుదిన నొడబడును
ఆరూఢి మంత్రసిధ్ధుడనయ్యేననే యాసలను
ఘోరపు పాట్లకు గక్కున నొడబడును

యిట్టె యక్షిణిఁ బంపు సేయించుకొనేయాసలను
వొట్టి జీవహింసలకు నొడబడును
దిట్టతనమున తా నదృశ్యము సాధించేయాస
జట్టిగ భూతాల పూజించగ నొడబడును

చాపలపు సిరులకై శక్తి గొలిచేయాసను
వోపి నిందలకునెల్లా నొడబడును
యేపున శ్రీవేంకటేశు డేలి చేపట్టినదాకా
ఆపరానియాస నెందుకైనా నొడబడును


tanalOnuMDina hari@M dAgoluvaDI dEhi
yenalEka SaraNaMTE nitaDE rakshiMchunu

kOri mudimi mAnupukonEyAsa maMdulaMTA
vUrakE chEduludina noDabaDunu
ArUDhi maMtrasidhdhuDanayyEnanE yAsalanu
ghOrapu pATlaku gakkuna noDabaDunu

yiTTe yakshiNi@M baMpu sEyiMchukonEyAsalanu
voTTi jIvahiMsalaku noDabaDunu
diTTatanamuna tA nadRSyamu sAdhiMchEyAsa
jaTTiga bhUtAla pUjiMchaga noDabaDunu

chApalapu sirulakai Sakti golichEyAsanu
vOpi niMdalakunellA noDabaDunu
yEpuna SrIvEMkaTESu DEli chEpaTTinadAkA
AparAniyAsa neMdukainA noDabaDunu

nelatabAsi uMDalEnu - నెలతబాసి ఉండలేను


నెలతబాసి ఉండలేను నిముషమెందు నేడు నాకు
తలపులో నీవలెనె రతుల తరుణి కలయుటెన్నడే

ముదిత నాయెదుట నిలిచి మోసులువార నవ్వు నవ్వి
కదలు జూపుల జూచి నాకు కన్నులార్చుటెన్నడే
వదలుఁబయ్యద సవదరించి వలపుతేట చవులు జూపి
కొదలు మాటలు ముద్దు గునిసి కూరిమి గొసరు టెన్నదే

చెలియ సిగ్గున మోము వంచి చెక్కునఁ జేయి మాటు వేసి
మలసి వీడెమిచ్చి ఆకుమడిచి యిచ్చు టెన్నడే
వలుదచన్ను లురము మోపి వాసన యూర్పు చల్లి చల్లి
కలయ మోవితేనె లొసగు కంచము పొత్తులెన్నడే

యింతి నన్నుఁజేరబిలిచి యింటిలోని పరుపు మీద
దొంతికళలు రేగనంటి దొమ్మిసేయు టెన్నడే
వింతలేక యిపుడె శ్రీవేంకటేశ్వరుడైన
పొంతనున్న నన్నుగూడ పొద్దు దెలియుటెన్నడే


nelatabAsi uMDalEnu nimushameMdu nEDu nAku
talapulO nIvalene ratula taruNi kalayuTennaDE

mudita nAyeduTa nilichi mOsuluvAra navvu navvi
kadalu jUpula jUchi nAku kannulArchuTennaDE
vadalu@Mbayyada savadariMchi valaputETa chavulu jUpi
kodalu mATalu muddu gunisi kUrimi gosaru TennadE

cheliya sigguna mOmu vaMchi chekkuna@M jEyi mATu vEsi
malasi vIDemichchi AkumaDichi yichchu TennaDE
valudachannu luramu mOpi vAsana yUrpu challi challi
kalaya mOvitEne losagu kaMchamu pottulennaDE

yiMti nannu@MjErabilichi yiMTilOni parupu mIda
doMtikaLalu rEganaMTi dommisEyu TennaDE
viMtalEka yipuDe SrIvEMkaTESwaruDaina
poMtanunna nannugUDa poddu deliyuTennaDE



maMdulEdu dIniki - మందులేదు దీనికి

మందులేదు దీనికి మంత్రమేమియు లేదు
మందు మంత్రము దనమతిలోనే కలదు

కదలకుండగ దన్ను గట్టివేసిన గట్టు
వదలించుకొన గొంత వలదా
వదలించబోయిన వడిగొని పైపైనే
కదియుగాని తన్ను వదలదేమియును

మనసులోపలనుండి మరి మీద దానుండి
యెనసినతిరువేంకటేశుని
తనరినతలపున దలప దుష్కృతములు
తనకుదానే వీడు దలకవలదుగాన


pa|| maMdulEdu dIniki maMtramEmiyu lEdu
maMdu maMtramu danamatilOnE kaladu

ca|| kadalakuMDaga dannu gaTTivEsina gaTTu
vadaliMcukona goMta valadA
vadaliMcabOyina vaDigoni paipainE
kadiyugAni tannu vadaladEmiyunu

ca|| manasulOpalanuMDi mari mIda dAnuMDi
yenasinatiruvEMkaTESuni
tanarinatalapuna dalapa duShkRutamulu
tanakudAnE vIDu dalakavaladugAna