అదె లంకసాధించె నవనిభారము దించె
విదితమై ప్రతాపము వెలయించె నితడు ||
రవివంశ తిలకుడు రాముడితడు
భువిపుట్టె దశరథ పుత్రుడితడు |
భు(భ)వుడెంచె తారక బ్రహ్మమీతడు
పవనజుకిచ్చినాడు బ్రహ్మపట్టమితడు ||
బలువుడు సీతాపతి యితడు
తలకొన్న వాలిమర్దనుడీతడు |
విలసిల్లె ఏకంగ వీరుడితడు
చలమరి కోదండ దీక్షాగురుడితడు ||
శరణాగత వజ్ర పంజరుడితడు
సరిలేని అసురభంజకుడీతడు |
వరదుడు శ్రీవేంకటేశ్వరుడితడు
అరయ విజయ నగరాధీశుడితడు ||
ade laMkasAdhimche navanibhAramu diMche
viditamai pratApamu velayiMce nitaDu ||
ravivaMSa tilakuDu rAmuDitaDu
bhuvipuTTe daSaratha putruDitaDu |
bhu(bha)vuDeMche tAraka brahmamItaDu
pavanajukichchinADu brahmapaTTamitaDu ||
baluvuDu sItApati yitaDu
talakonna vAlimardanuDItaDu |
vilasille EkaMga vIruDitaDu
chalamari kOdaMDa dIkshAguruDitaDu ||
SaraNAgata vajra paMjaruDitaDu
sarilEni asurabhaMjakuDItaDu |
varaduDu SrIvEMkaTESwaruDitaDu
araya vijaya nagarAdhISuDitaDu ||