అంగనకు నీవే
అఖిలసామ్రాజ్యము
శ్రింగారరాయ(డ నీకు
శ్రీసతినిధానము
కమలాలపానుపు
కాంతకు నీవురము
ప్రమదపు నీమనసు
పాలజలధి
అమరు నీభుజాంతర
మట్టె తీగెపొదరిల్లు
రమణీయ (ప్ర)హారాలు
రత్నాలమేడలు
సతికి నీమెడా రతిసాము సేసేకంబము
ప్రతిలేని వయ్యాళి బయలు నీవు
మతించిన కౌస్తుభమణి నిలువుటద్దము
మితిలేని శ్రీవత్సము మించుబండారుముద్ర
నెమ్మి నలమేల్మంగ నీకౌగిలి పెండ్లిపీట
చిమ్ముల చందనచర్చ సేసపాలు
వుమ్మడి మెడనూళ్ళు వుయ్యాలసరపణులు
పమ్మి శ్రీవేంకటేశ నీభావమే భోగము
AMganaku nIvE akhilasAmrAjyamu
SriMgArarAya(Da nIku SrIsatinidhAnamu
kamalAlapAnupu kAMtaku nIvuramu
pramadapu nImanasu pAlajaladhi
amaru nIbhujAMtara maTTe tIgepodarillu
ramaNIya (pra)hArAlu ratnAlamEDalu
satiki nImeDA ratisAmu sEsEkaMbamu
pratilEni vayyALi bayalu nIvu
matiMchina kaustubhamaNi niluvuTaddamu
mitilEni SrIvatsamu miMchubaMDArumudra
nemmi nalamElmaMga nIkaugili peMDlipITa
chimmula chaMdanacharcha sEsapAlu
vummaDi meDanULLu vuyyAlasarapaNulu
pammi SrIvEMkaTESa nIbhAvamE bhOgamu