అనంత మధ్భుత మాశ్చర్యం బిది
సనాతనుడ నను సరవిగావవే
బలిమి నసురలకు భయంకరుడవు
అలరి యమరులకు నానందకరుడవు
తలకొని ఋషులకు తపఃఫలదుడవు
పలు నీ మహిమలు పలుకగ వశమా
అరయ వేదముల కాధారంబవు
పరగగ జీవుల ప్రాణనాథుడవు
పరమయోగులకు పరబ్రహ్మమవు
తిరముగ నీమూర్తి దెలియగ వశమా
జగముల కెల్లను సర్వబంధుడవు
తగిలిన శ్రీకాంతకు నివాసమవు
జిగి శ్రీవైష్ణవులకు శ్రీవేంకటపతివి
తగు నీ కత లివి తలచగ వశమా
anaMta madhbhuta mAScharyaM bidi
sanAtanuDa nanu saravigAvavE
balimi nasuralaku bhayaMkaruDavu
alari yamarulaku nAnaMdakaruDavu
talakoni RShulaku tapa@hphaladuDavu
palu nI mahimalu palukaga vaSamA
araya vEdamula kAdhAraMbavu
paragaga jIvula prANanAthuDavu
paramayOgulaku parabrahmamavu
tiramuga nImUrti deliyaga vaSamA
jagamula kellanu sarwabaMdhuDavu
tagilina SrIkAMtaku nivAsamavu
jigi SrIvaiShNavulaku SrIvEMkaTapativi
tagu nI kata livi talachaga vaSamA