ప|| అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు | దినదిన క్రొత్తలాయ ద్రిష్టమిదే మాకు ||
చ|| ఆడెడి బాలుల హరి అంగలి చూపుమని | తోడనే వాండ్ల నోర దుమ్ములు చల్లి |
యీడమాతో చెప్పగాను యిందరము గూడిపోయి | చూడపోతే పంచదారై చోద్యమాయనమ్మా ||
చ|| తీట తీగెలు సొమ్మంటూ దేహము నిండ గట్టె | తీటకుగాక బాలులు తెగి వాపోగా |
పాటించి యీసుద్దివిని పారితెంచి చూచితేను | కోటికోటి సొమ్ములాయ కొత్తలోయమ్మా ||
చ|| కాకి జున్ను జున్నులంటా గంపెడేసి తినిపించి | వాకొలిపి బాలులెల్ల వాపోగా |
ఆకడ శ్రీవేంకటేశుడా బాలుల కంటి నీరు | జోకగ ముత్యాలుసేసె జూడగానే నేము ||
pa|| anarAdu vinarAdu Atani mAyalu nEDu | dinadina krottalAya driShTamidE mAku ||
ca|| ADeDi bAlula hari aMgali cUpumani | tODanE vAMDla nOra dummulu calli | yIDamAtO ceppagAnu yiMdaramu gUDipOyi | cUDapOtE paMcadArai cOdyamAyanammA ||
ca|| tITa tIgelu sommaMTU dEhamu niMDa gaTTe | tITakugAka bAlulu tegi vApOgA | pATiMci yIsuddivini pAriteMci cUcitEnu | kOTikOTi sommulAya kottalOyammA ||
ca|| kAki junnu junnulaMTA gaMpeDEsi tinipiMci | vAkolipi bAlulella vApOgA | AkaDa SrIvEMkaTESuDA bAlula kaMTi nIru | jOkaga mutyAlusEse jUDagAnE nEmu ||
|