అన్నిటా భాగ్యవంతుడవౌదు వయ్యా
పన్నినందుకల్లా వచ్చు భామ నీకునిపుడు
పడతి మోహరసము పన్నీటి మజ్జనము
కడలేని యాపెసిగ్గు కప్పురకాపు
నిడుదకన్ను చూపులు నించిన తట్టుపునుగు
తొడిబడ సులభాన దొరకె నీకిపుడు
కామిని కెమ్మోవి కాంతి కట్టుకొనే చంద్రగావి
ఆముకొన్న మోహకళలాభరణాలు
దోమటిమాటలవిందు ధూపదీపనైవేద్యాలు
కామించినటువలెనె కలిగె నీకిపుడు
అలమేలుమంగ నవ్వులంగపు పువ్వు దండలు
కలసి వురాన నీకే కట్టిన తాళి
చలపట్టి యీకెరతి సకలసంపదలు
యిలనబ్బె శ్రీవేంకటేశ నీకు నిపుడు
anniTA bhAgyavaMtuDavoudu vayyA
panninaMdukallA vachchu bhAma nIkunipuDu
paDati mOharasamu pannITi majjanamu
kaDalEni yApesiggu kappurakApu
niDudakannu chUpulu niMchina taTTupunugu
toDibaDa sulabhAna dorake nIkipuDu
kAmini kemmOvi kAMti kaTTukonE chaMdragAvi
Amukonna mOhakaLalAbharaNAlu
dOmaTimATalaviMdu dhUpadIpanaivEdyAlu
kAmiMchinaTuvalene kalige nIkipuDu
alamElumaMga navvulaMgapu puvvu daMDalu
kalasi vurAna nIkE kaTTina tALi
chalapaTTi yIkerati sakalasaMpadalu
yilanabbe SrIvEMkaTESa nIku nipuDu
anniTA bhAgyavaMtuDavoudu - అన్నిటా భాగ్యవంతుడవౌదు
5:30 AM
A-Annamayya, అ