ప|| అన్నిటికి నిదె పరమౌషధము | వెన్నుని నామము విమలౌషధము ||
చ|| చిత్త శాంతికిని శ్రీపతి నామమె | హత్తిన నిజ దివ్యౌషధము |
మొత్తపు బంధ విమోచనంబునకు | చిత్తజ గురుడే సిద్ధౌషధము ||
చ|| పరిపరి విధముల భవరోగములకు | హరి పాద జలమె యౌషధము |
దురిత కర్మముల దొలగించుటకును | మురహరు పూజే ముఖ్యౌషధము ||
చ|| ఇల నిహ పరముల నిందిరా విభుని | నలరి భజింపుటె యౌషధము |
కలిగిన శ్రీ వేంకటపతి శరణమె | నిలిచిన మాకిది నిత్యౌషధము ||
pa|| anniTiki nide paramauShadhamu | vennuni nAmamu vimalauShadhamu ||
ca|| citta SAMtikini SrIpati nAmame | hattina nija divyauShadhamu |
mottapu baMdha vimOcanaMbunaku | cittaja guruDE siddhauShadhamu ||
ca|| paripari vidhamula BavarOgamulaku | hari pAda jalame yauShadhamu |
durita karmamula dolagiMcuTakunu | muraharu pUjE muKyauShadhamu ||
ca|| ila niha paramula niMdirA viBuni | nalari BajiMpuTe yauShadhamu |
kaligina SrI vEMkaTapati SaraName | nilicina mAkidi nityauShadhamu ||