ప|| అన్నివిభవముల అతడితడు |కన్నులువేవేలు గలఘనుడు ||
చ|| వేదాంత కోటులవిభుడు ఇతడు |నాదబ్రహ్మపు నడుమితడు |
ఆదియంత్యముల కరుదితడు |దేవుడు సరసిజ నాభుడు ఇతడు ||
చ|| భవములణచు యదుపతి యితడు |భువనము లన్నిటికి పొడ వితడు|
దివికి దివమైన తిరమితదు |పవనసుతు నేలిన పతి యితడు ||
చ|| గరుడుని మీదటి ఘనుడితడు |సిరు లందరి కిచ్చే చెలు వితడు |
తిరు వేంకట నగము దేవు డితడు |పరమ పదమునకు ప్రభు వితడు ||
pa|| anni vibhavamula ataDitaDu | kannulu vEvElu galaGanuDu ||
ca|| vEdAMta kOTulaviBuDu itaDu | nAdabrahmapu naDumitaDu |
AdiyaMtyamula karuditaDu | dEvuDu sarasija nABuDu itaDu ||
ca|| BavamulaNacu yadupati yitaDu | Buvanamu lanniTiki poDa vitaDu |
diviki divamaina tiramitadu | pavanasutu nElina pati yitaDu ||
ca|| garuDuni mIdaTi ghanuDitaDu | siru laMdari kiccE celu vitaDu |
tiru vEMkaTa nagamu dEvu DitaDu | parama padamunaku praBu vitaDu ||