అతడే రక్షకుడందరి కతడే
పతి యుండగ భయపడ జోటేది
అనంతకరము లనంతాయుధము-
లనంతుడు ధరించెలరగను
కనుగొని శరణాగతులకు మనకును
పనివడి యిక భయపడజోటేది
ధరణి నభయహస్తముతో నెప్పుడు
హరి రక్షకుడై యలరగను
నరహరికరుణే నమ్మిన వారికి
పరదున నిక భయపడజోటేది
శ్రీవేంకటమున జీవుల గాచుచు
నావల నీవల నలరగను
దైవశిఖామణి దాపగు మాకును
భావింపగ భయపడజోటేది
ataDE rakshakuDaMdari kataDE
pati yuMDaga bhayapaDa jOTEdi
anaMtakaramu lanaMtAyudhamu-
lanaMtuDu dhariMchelaraganu
kanugoni SaraNAgatulaku manakunu
panivaDi yika bhayapaDajOTEdi
dharaNi nabhayahastamutO neppuDu
hari rakshakuDai yalaraganu
naraharikaruNE nammina vAriki
paraduna nika bhayapaDajOTEdi
SrIvEMkaTamuna jIvula gAchuchu
nAvala nIvala nalaraganu
daivaSikhAmaNi dApagu mAkunu
bhAviMpaga bhayapaDajOTEdi