ప|| అటువంటివాడువో హరిదాసుడు | ఆటమాటలు విడిచినాతడే సుఖి ||
చ|| తిట్టేటిమాటలును దీవించేమాటలును | అట్టే సరెయని తలచినాతడే సుఖి |
పట్టిచంపేవేళను పట్టముగట్టేవేళ | అట్టునిట్టు చలించని యాతడే సుఖి ||
చ|| చేరి పంచదారిడిన జేదు దెచ్చిపెట్టినాను | ఆరగించి తనివొందే యతడే సుఖి |
తేరకాండ్ల జూచిన తెగరానిచుట్టముల | నారయ సరిగాజూచే యాతడే సుఖి ||
చ|| పొంది పుణ్యము వచ్చిన పొరి బాపము వచ్చిన- | నందలి ఫలమొల్లని యాతడే సుఖి |
విందుగా శ్రీవేంకటాద్రి విభునిదాసుల జేరి | అందరానిపద మందిన నాతడే సుఖి ||
pa|| aTuvaMTivADuvO haridAsuDu | ATamATalu viDicinAtaDE suKi ||
ca|| tiTTETimATalunu dIviMcEmATalunu | aTTE sareyani talacinAtaDE suKi |
paTTicaMpEvELanu paTTamugaTTEvELa | aTTuniTTu caliMcani yAtaDE suKi ||
ca|| cEri paMcadAriDina jEdu deccipeTTinAnu | AragiMci tanivoMdE yataDE suKi |
tErakAMDla jUcina tegarAnicuTTamula | nAraya sarigAjUcE yAtaDE suKi ||
ca|| poMdi puNyamu vaccina pori bApamu vaccina- | naMdali Palamollani yAtaDE suKi |
viMdugA SrIvEMkaTAdri viBunidAsula jEri | aMdarAnipada maMdina nAtaDE suKi ||