ప|| అయ్యోపోయ ప్రాయము కాలము |
ముయ్యంచుమనసున నే మోహమతి నైతి ||
చ|| చుట్టంబులా తనకు సుతులు గాంతలు జెలులు |
వట్టియాసల బెట్టువారేకాక |
నెట్టుకొని వీరు గడునిజమనుచు హరి నాత్మ |
బెట్టనేరక వౄథా పిరివీకులైతి ||
చ || తగుబంధులా తనకు తల్లులును తండ్రులును
వగల( బెట్టుచు తిరుగువారేకాక
మిగుల వీరలపొందు మేలనుచు హరినాత్మ
తగిలించలేక చింతాపరుడనైతి
చ|| అంతహితులా తనకు నన్నలును దమ్ములును |
వంతువాసికి బెనగువారేకాక |
అంతరాత్ముడు శ్రీవేంకటాద్రీశు గొలువకిటు |
సంతకూటముల యలజడికి లోనైతి ||
pa|| ayyOpOya prAyamu kAlamu |
muyyaMcumanasuna nE mOhamati naiti ||
ca|| cuTTaMbulA tanaku sutulu gAMtalu jelulu |
vaTTiyAsala beTTuvArEkAka |
neTTukoni vIru gaDunijamanucu hari nAtma |
beTTanEraka vRuthA pirivIkulaiti ||
ca || tagubaMdhulA tanaku tallulunu taMDrulunu
vagala( beTTuchu tiruguvArEkAka
migula vIralapoMdu mElanuchu harinAtma
tagiliMchalEka chiMtAparuDanaiti
ca|| aMtahitulA tanaku nannalunu dammulunu |
vaMtuvAsiki benaguvArEkAka |
aMtarAtmuDu SrIvEMkaTAdrISu goluvakiTu |
saMtakUTamula yalajaDiki lOnaiti ||