చలువలు వేండ్లు జరపగ నేటికి
నెలవగు మేలే నించగ రాదా
మోహము చెలిపై ముంచిన వాడవు
దాహపు విరహము తరవేల
సాహసి మొదలనె చలముల కోపదు
యీహల నీవే యెరుగుదు వి(కను
చేసన్నలనే చెనకినవాడవు
వాసులు సతిపై వంచుదురా
ఆసలనే కడు నలసిన దిందాక
ఆ సుద్దులు మమ్మడగకు మికను
కాగిట నంగన కలసినవాడవు
మాగిన సిగ్గులు మరియాల
చేగ దీ(దే)ర్చెనిదె శ్రివేంకటేశ్వర
వీగక ననుపులు విడువకు మికనూ
chaluvalu vEMDlu jarapaga nETiki
nelavagu mElE niMchaga rAdA
mOhamu chelipai muMchina vADavu
dAhapu virahamu taravEla
sAhasi modalane chalamula kOpadu
yIhala nIvE yerugudu vi(kanu
chEsannalanE chenakinavADavu
vAsulu satipai vaMchudurA
AsalanE kaDu nalasina diMdAka
A suddulu mammaDagaku mikanu
kAgiTa naMgana kalasinavADavu
mAgina siggulu mariyAla
chEga dI(dE)rchenide SrivEMkaTESwara
vIgaka nanupulu viDuvaku mikanU