చవినోరి కేడ దెత్తు సంప దేడదెత్తు వీని
సవరించుటే నాసంప దిదిగాదా
పచ్చడా లెక్కడదెత్తు పట్టుచీర లేడాదెత్తు
వెచ్చనిండ్లేడదెత్తు వెంటవెంటను
తెచ్చిన యీపచ్చడము దేహమిది వెంటవెంట
వచ్చీగాక తన్ను(దానె వద్దనగవచ్చునా
దొరతనమేడ దెత్తు దొడ్డసొమ్ము లేడదెత్తు
యెరవులసిరుల నేనేడదెత్తు
వెరవున నేనెవ్వరిని వేసరించజాలక
దరిచేరుటే దొరతనమిది గాదా
తోడబుట్టువుల నేడా (దోడితెత్తు( జుట్టాల
నేడ దెత్తు సుతులపొం దేడదెత్తును
వేడుకైనపొందు శ్రీవెంకటేశు( దలచుటే
ఈడులేనిబంధుకోటి ఈతడేకాడా
chavinOri kEDa dettu saMpa dEDadettu vIni
savariMchuTE nAsaMpa didigAdA
pachchaDA lekkaDadettu paTTuchIra lEDAdettu
vechchaniMDlEDadettu veMTaveMTanu
techchina yIpachchaDamu dEhamidi veMTaveMTa
vachchIgAka tannu(dAne vaddanagavachchunA
doratanamEDa dettu doDDasommu lEDadettu
yeravulasirula nEnEDadettu
veravuna nEnevvarini vEsariMchajAlaka
darichEruTE doratanamidi gAdA
tODabuTTuvula nEDA (dODitettu( juTTAla
nEDa dettu sutulapoM dEDadettunu
vEDukainapoMdu SrIveMkaTESu( dalachuTE
IDulEnibaMdhukOTi ItaDEkADA
|