ప|| ఈడగుపెండ్లి ఇద్దరి చేసేము | చేడెలాల ఇది చెప్పరుగా ||
చ|| పచ్చికబయళ్ళ పడతి ఆడగ | ముచ్చట కృష్ణుడు మోహించి |
వెచ్చపు పూదండ వేసి వచ్చెనట | గచ్చుల నాతని కానరుగ ||
చ|| మ్త్తెపు ముంగిట ముదిత నడువగ | ఉత్తముడే చెలి వురమునను |
చిత్తరవు వ్రాసి చెలగివచ్చె నొక | జొత్తుమాని ఇటు జూపరుగా ||
చ|| కొత్తచవికెలో కొమ్మనిలిచితే | పొత్తున తలబాలు వోసెనట |
ఇత్తల శ్రీవేంకటేశుడు నవ్వుచు | హత్తి సతిగూడె నని పాడరుగా ||
pa|| IDagupeMDli iddari cEsEmu | cEDelAla idi cepparugA ||
ca|| paccikabayaLLa paDati ADaga | muccaTa kRuShNuDu mOhiMci |
veccapu pUdaMDa vEsi vaccenaTa | gaccula nAtani kAnaruga ||
ca|| mttepu muMgiTa mudita naDuvaga | uttamuDE celi vuramunanu |
cittaravu vrAsi celagivacce noka | jottumAni iTu jUparugA ||
ca|| kottacavikelO kommanilicitE | pottuna talabAlu vOsenaTa |
ittala SrIvEMkaTESuDu navvucu | hatti satigUDe nani pADarugA ||
Sung By:Balakrishna Prasad
|