ఈతని మూలమే పో యిలగల ధనములు
ఈతడు మాకు గలడు యెంత లేదు ధనము
విరతి మాధనము విజ్ఞానమే ధనము
మరిగినతత్వమే మాధనము
పరము మాధనము భక్తే మాధనము మా
కరిరాజవరదుడే కైవల్యధనము
శాంతమే మాధనము సంకీర్తనే ధనము
యెంతైనా నిశ్చింతమే ఇహధనము
అంతరాత్మే మాధనము హరిదాస్యమే ధనము
యింతటా లక్ష్మీకాంతు డింటిమూలధనము
ఆనందమే ధనము ఆచార్యుడే ధనము
నానాట పరిపూర్ణమే ధనము
ధ్యానమే మా ధనము దయే మాధనము
పానిన శ్రీవేంకటాద్రిపతియే మాధనము
Itani mUlamE pO yilagala dhanamulu
ItaDu mAku galaDu yeMta lEdu dhanamu
virati mAdhanamu vij~nAnamE dhanamu
mariginatatwamE mAdhanamu
paramu mAdhanamu bhaktE mAdhanamu mA
karirAjavaraduDE kaivalyadhanamu
SAMtamE mAdhanamu saMkIrtanE dhanamu
yeMtainA niSchiMtamE ihadhanamu
aMtarAtmE mAdhanamu haridAsyamE dhanamu
yiMtaTA lakshmIkAMtu DiMTimUladhanamu
AnaMdamE dhanamu AchAryuDE dhanamu
nAnATa paripUrNamE dhanamu
dhyAnamE mA dhanamu dayE mAdhanamu
pAnina SrIvEMkaTAdripatiyE mAdhanamu