ప|| ఎక్కువకులజుడైన హీనకులజుడైన | నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు ||
చ|| వేదములు చదివియు విముఖుడై హరిభక్తి | యాదరించలేని సోమయాజికంటె |
యేదియునులేని కులహీనుడైనను విష్ణు | పాదములు సేవించు భక్తుడే ఘనుడు ||
చ|| పరమమగు వేదాంత పఠన దొరికియు సదా | హరిభక్తిలేని సన్యాసికంటె |
సరవి మాలిన యంత్యజాతి కులజుడైన | నరసి విష్ణు వెదుకునాతడే ఘనుడు ||
చ|| వినియు జదివియును శ్రీవిభుని దాసుడుగాక | తనువు వేపుచునుండు తపసికంటె |
ఎనలేని తిరువేంకటేశు ప్రసాదాన్న- | మనుభవించిన యాతడప్పుడే ఘనుడు ||
pa|| ekkuvakulajuDaina hInakulajuDaina | nikkamerigina mahAnityuDE GanuDu ||
ca|| vEdamulu cadiviyu vimuKuDai hariBakti | yAdariMcalEni sOmayAjikaMTe |
yEdiyunulEni kulahInuDainanu viShNu | pAdamulu sEviMcu BaktuDE GanuDu ||
ca|| paramamagu vEdAMta paThana dorikiyu sadA | hariBaktilEni sanyAsikaMTe |
saravi mAlina yaMtyajAti kulajuDaina | narasi viShNu vedukunAtaDE GanuDu ||
ca|| viniyu jadiviyunu SrIviBuni dAsuDugAka | tanuvu vEpucunuMDu tapasikaMTe |
enalEni tiruvEMkaTESu prasAdAnna- | manuBaviMcina yAtaDappuDE GanuDu ||