ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము
వేమరు నోపుణ్యులాల వినరో యీకతలు
అనంతసూర్యతేజుడట కాంతి చెప్పనెంత
దనుజాంతకుండట ప్రతాపమెంత
మనసిజగురుడట మరిచక్కదనమెంత
వనజజుగనినట్టివాడట ఘనతెంత
గంగాజనకుడాట కడుజెప్పే పుణ్యమెంత
చెంగట భూకాంతుడట సింగార మెంత
రంగగు లక్ష్మీశుడట రాజసము లెంచ నెంత
అంగవించు సర్వేశుడట సంపదెంత
మాయానాథుడట మహిమ వచించు టెంత
యేయెడ దా విష్ణుడట యిరవెంత
పాయక శ్రీవేంకటాద్రిపతియై వరములిచ్చే
వేయిరూపులవాడట విస్తార మెంత
Emani pogaDavachchu nItani prabhAvamu
vEmaru nOpuNyulAla vinarO yIkatalu
anaMtasUryatEjuDaTa kAMti cheppaneMta
danujAMtakuMDaTa pratApameMta
manasijaguruDaTa marichakkadanameMta
vanajajuganinaTTivADaTa ghanateMta
gaMgAjanakuDATa kaDujeppE puNyameMta
cheMgaTa bhUkAMtuDaTa siMgAra meMta
raMgagu lakshmISuDaTa rAjasamu leMcha neMta
aMgaviMchu sarvESuDaTa saMpadeMta
mAyAnAthuDaTa mahima vachiMchu TeMta
yEyeDa dA vishNuDaTa yiraveMta
pAyaka SrIvEMkaTAdripatiyai varamulichchE
vEyirUpulavADaTa vistAra meMta