ఏమని పొగడుదుమే (రాగం:ఆభేరి ) (తాళం :ఆదితాళం )
ప|| ఏమని పొగదుడుమే యికనిను | ఆమని సొబగుల అలమేల్మంగ ||
చ|| తెలికన్నుల నీ తేటలే కదవే | వెలయగ విభునికి వెన్నెలలు |
పులకల మొలకల పొదులివి గదవే | పలుమరు పువ్వుల పానుపులు ||
చ|| తియ్యపు నీమోవి తేనెలే కదవే | వియ్యపు రమణుని విందులివి |
ముయ్యక మూసిన మొలక నవ్వు గదె | నెయ్యపు గప్పురపు నెరి బాగాలు ||
చ|| కైవసమగు నీ కౌగిలే కదవే | శ్రీ వేంకటేశ్వరు సిరి నగరు |
తావు కొన్న మీ తమకములే కదే | కావించిన మీ కల్యాణములు ||
Emani pogaDudumE (Raagam: ) (Taalam: )
pa|| Emani pogaDudumE yikaninu | Amani sobagula alamelmaMga ||
ca|| telikannula nI tETalE kadavE | velayaga viBuniki vennelalu |
pulakala molakala pAdulivi gadavE | palumaru buvvula pAnupulu ||
ca|| tiyyapu nImOvi tEnelE kadavE | viyyapu ramaNuni viMdulivi |
muyyaka mUsina molaka navvu gade | neyyapu gappurapu neri bAgAlu ||
ca|| kaivasamagu nI kaugilE kadavE | SrI vEMkaTESvaruni siri nagaru |
tAvu konna mI tamakamulE kadE | kAviMcina kalyANamulu ||
Sung by: S.Janiki
Sung by: Mangalampalli. Balamulali Krishna
Sung by: Balakrishna Prasad