ఎంత విభవము కలిగె నంతయును నాపదని|చింతించినది కదా చెడని జీవనము ||
చలము కోపంబు తను చంపేటి పగతులని|తెలిసినది యది కదా తెలివి ||
తలకొన్న పరనింద తనపాలి మృత్యువని|తొలగినది యది కదా తుదగన్నఫలము ||
మెఱయు విషయములే తన మెడనున్న వురులుగా|యెరిగినది యది కదా యెరుక ||
పఱివోని ఆస తను బుట్టుకొను భూతమని|వెరచినది యది కదా విఙాన మహిమ ||
యెనలేని తిరువేంకటేశుడే దైవమని| వినగలిగినది గదా వినికి||
అనయంబు నతని సేవానందపరులయి|మనగలిగినది గదా మనుజులకు మనికి ||
eMta vibhavamu kalige naMtayunu nApadani |chiMtimchinadi kadA cheDani jIvanamu ||
chalamu kOpambu tanu chaMpETi pagatulani |telisinadi yadi kadA telivi
talakonna paraniMda tanapAli mRtyuvani |tolaginadi yadi kadA tudagannaphalamu ||
me~rayu vishayamulE tana meDanunna vurulugA|yeriginadi yadi kadA yeruka
pa~rivOni Asa tanu buTTukonu bhUtamani |veracinadi yadi kadA vi~mAna mahima ||
yenalEni tiruvEMkaTESuDE daivamani |vinagaliginadi gadA viniki
anayaMbu natani sEvAnaMdaparulayi |managaliginadi gadA manujulaku maniki ||
Sung by:Balakrishna Prasad /(sdm)