హరి నీప్రతాపమున కడ్డమేది లోకమున
సరి వేరీ నీకుమరి సర్వేశ్వరా
నీవు నీళ్ళు నమిలితే నిండెను వేదములు
యీవల తలెత్తితేనే యింద్రపదవులు మించె
మోవ మూతి గిరిపితే మూడు లోకాలు నిలిచె
మోవిబార నవ్వితేనే ముగిసి రసురులు
గోరగీరితే నీరై కొండలెల్ల తగబారె
మారుకొంటే బయటనే మడుగులై నిలిచె
చేరి యడుగువెట్టితే శిలకు ప్రాణము వచ్చె
కూరిమి కావలెనంటే కొండా గొడుగాయను
కొంగుజారినంతలోనే కూలెను త్రిపురములు
కంగి గమనించితేనే కలిదోషములు మానె
రంగుగ నీశరణంటే రక్షించితి దాసులను
ముంగిట శ్రీవేంకటేశ మూలమవు నీవే
hari nIpratApamuna kaDDamEdi lOkamuna
sari vErI nIkumari sarwESwarA
nIvu nILLu namilitE niMDenu vEdamulu
yIvala talettitEnE yiMdrapadavulu miMche
mOva mUti giripitE mUDu lOkAlu niliche
mOvibAra navvitEnE mugisi rasurulu
gOragIritE nIrai koMDalella tagabAre
mArukoMTE bayaTanE maDugulai niliche
chEri yaDuguveTTitE Silaku prANamu vachche
kUrimi kAvalenaMTE koMDA goDugAyanu
koMgujArinaMtalOnE kUlenu tripuramulu
kaMgi gamaniMchitEnE kalidOshamulu mAne
raMguga nISaraNaMTE rakshiMchiti dAsulanu
muMgiTa SrIvEMkaTESa mUlamavu nIvE
hari nIpratApamuna kaDDamEdi
6:02 AM
H-Annamayya, హ