ఇటునిను తెలియగ ఎంతటివారము
తటుకన నాసల తగులుటగాక
నానామూర్తులు నగధర నీరూపు
యే నెలవుల నిన్నెటువలె దలచుట
పూని నీ భావము పొందుగా జెప్పగా
వీనులు చల్లగా వినుటే గాక
పెక్కునామములు బిరుదు లనంతము-
లెక్కడ కొలదిగ నెన్నని పొగడుట
యిక్కువ సేసుక యిందులో నొకటి
పక్కన నొకమరి పలుకుట గాక
వేవేలు గలవు నీ విహారభూములు
యే విధమున ఎందెందని తిరుగుట
శ్రీవేంకటేశా నీ శృంగారమెల్లను
సేవించి ముదమున చెలగుటగాక
iTuninu teliyaga eMtaTivAramu
taTukana nAsala taguluTagAka
nAnAmUrtulu nagadhara nIrUpu
yE nelavula ninneTuvale dalachuTa
pUni nI bhAvamu poMdugA jeppagA
vInulu challagA vinuTE gAka
pekkunAmamulu birudu lanaMtamu-
lekkaDa koladiga nennani pogaDuTa
yikkuva sEsuka yiMdulO nokaTi
pakkana nokamari palukuTa gAka
vEvElu galavu nI vihArabhUmulu
yE vidhamuna eMdeMdani tiruguTa
SrIvEMkaTESA nI SRMgAramellanu
sEviMchi mudamuna chelaguTagAka
ituninu theliyaga
6:57 AM
I- Annamayya, ఇ