ప|| జయజయ నృసింహ సర్వేశ | భయహర వీర ప్రహ్లాద వరద ||
చ|| మిహిర శశినయన మృగనర వేష | బహి రంతస్థల పరిపూర్ణ |
అహి నాయక సింహాసన రాజిత | బహుళ గుణ గణ ప్రహ్లాద వరద ||
చ|| చటుల పరాక్రమ సమఘన విరహిత | నిటుల నేత్ర మౌని ప్రణుత |
కుటిల దైత్య తతి కుక్షి విదారణ | పటు వజ్రనఖ ప్రహ్లాద వరద ||
చ|| శ్రీ వనితా సంశ్రిత వామాంక | భావజ కోటి ప్రతిమాన |
శ్రీ వేంకటగిరి శిఖర నివాస | పావన చరిత ప్రహ్లాద వరద ||
pa|| jayajaya nRsiMha sarvESa | Bayahara vIra prahlAda varada ||
ca|| mihira SaSinayana mRganara vESha | bahi raMtasthala paripUrNa |
ahi nAyaka siMhAsana rAjita | bahuLa guNa gaNa prahlAda varada ||
ca|| caTula parAkrama samaGana virahita | niTula nEtra mauni praNuta |
kuTila daitya tati kukShi vidAraNa | paTu vajranaKa prahlAda varada ||
ca|| SrI vanitA saMSrita vAmAMka | BAvaja kOTi pratimAna |
SrI vEMkaTagiri SiKara nivAsa | pAvana carita prahlAda varada ||