జయము మనది వనచరులాల
రయమున దర్మదారలు తుత్తుతూ
రక్కసులమీద రాముడలిగె: నలు
దిక్కుల నడవుడూ తిడిం తిడిం
యెక్కుడు సేనలు యిటు మొరయింపుడు
డక్కానినదము ఢమ ఢమ ఢమం
కుటిలదానవుల( గొట్టుడూ; కోటలు
తటుకున దాటుడు ధణం ధణం
పటుగతినార్చుచు పట్టుడు లగ్గలు
పెటులు చూడుడదె పెట పెట పెటల్
గుట్టున నుండక కూలె రావణుడు
పట్టుడు సంకులు భం భం భం
యిట్టె శ్రీవేంకటేశుడు గెలిచెను
తిట్టలై యాడుడు ధిం ధిం ధిం
jayamu manadi vanacharulAla
rayamuna darmadAralu tuttutU
rakkasulamIda rAmuDalige: nalu
dikkula naDavuDU tiDiM tiDiM
yekkuDu sEnalu yiTu morayiMpuDu
DakkAninadamu Dhama Dhama DhamaM
kuTiladAnavula( goTTuDU; kOTalu
taTukuna dATudU dhaNaM dhaNaM
paTugatinArchuchu paTTuDu laggalu
peTulu chUDuDade peTa peTa peTal
guTTuna nuMDaka kUle rAvaNuDu
paTTuDu saMkulu bhaM bhaM bhaM
yiTTe SrIvEMkaTESuDu gelichenu
tiTTalai yADuDu dhiM dhiM dhiM
jayamu manadi - జయము మనది
5:28 AM
J-Annamayya, జ