ప|| నటనల భ్రమయకు నా మనసా | ఘటియించు హరియే కలవాడు ||
చ|| ముంచిన జగమిది మోహినీ గజము | పొంచిన యాస పుట్టించేది |
వంచనల నిజమువలెనే వుండును | మంచులు మాయలె మరునాడు ||
చ|| సరి సంసారము సంతలకూటమి | సొరిది బజారము చూపేది |
గరిమ నెప్పుడు గలకల మనుచుండును | మరులగు విధమే మాపటికి ||
చ|| కందువ దేహముగాని ముదియదిది | అందిన రూప మాడేదిది |
యెందును శ్రీ వేంకటేశ్వరుండును | డిందు పడగనిదె తెరమరుగు ||
pa|| naTanala Bramayaku nA manasA | GaTiyiMcu hariyE kalavADu ||
ca|| muMcina jagamidi mOhinI gajamu | poMcina yAsa puTTiMcEdi |
vaMcanala nijamuvalenE vuMDunu | maMculu mAyale marunADu ||
ca|| sari saMsAramu saMtalakUTami | soridi bajAramu cUpEdi |
garima neppuDu galakala manucuMDunu | marulagu vidhamE mApaTiki ||
ca|| kaMduva dEhamugAni mudiyadidi | aMdina rUpa mADEdidi |
yeMdunu SrI vEMkaTESvaruMDunu | DiMdu paDaganide teramarugu ||