నేడె నాగవెల్లి నేడే ఇల్లునింపులు
పోడిమి గోవిందపతి భోగించీ నిదివో
అల్లదే దేవుని రథ మల్లదే గరుడ ద్వజ-
మెల్ల లోకములు గెల్చి యేగీనదే
ఇల్లిదే లక్ష్మీ భూము లిద్దరు దేవుళ్ళు (వీరె)
చల్లేరు శాసలు తాము సరికి బేసికిని
సేనాపతి అల్లవాడె చేరి దేవతలు వారె
శ్రీనారాయణుడు చెలగీ నదే
ఆనుక అడుగడుగడుకు ఆరగించీ వీధులను
వానలుగా అందరికీ వరము లొసగుచు
దేవదుందుభులు మ్రోసె దిక్కులెల్లా చల్లనాయె
శ్రీ వేంకటేశుడితడె చిత్తగించీని
సేవించరో భావించరో జీవులాల బ్రతుకుడు
వేవేలు శోభనముల వేడుక కాడితడు ||
nEDe nAgavelli nEDE illuniMpulu
pODimi gOvimdapati bhOgiMchI nidivO
alladE dEvuni ratha malladE garuDa dwaja-
mella lOkamulu gelchi yEgInadE
illidE lakshmI bhUmu liddaru dEvuLLu (vIre)
challEru SAsalu tAmu sariki bEsikini
sEnApati allavADe chEri dEvatalu vAre
SrInArAyaNuDu chelagI nadE
Anuka aDugaDugaDuku AragiMchI vIdhulanu
vAnalugA aMdarikI varamu losaguchu
dEvaduMdubhulu mrOse dikkulellA challanAye
SrI vEMkaTESuDitaDe chittagiMchIni
sEviMcharO bhAviMcharO jIvulAla bratukuDu
vEvElu SObhanamula vEDuka kADitaDu ||
Sung by:Balakrishna Prasad