ప|| నీదాసుల భంగములు నీవుజూతురా |
ఏదని జూచేవు నీకు నెచ్చరించవలెనా ||
చ|| పాల సముద్రము మీద పవ్వళించ్చినట్టి నీకు |
బేలలై సురలు మొరవెట్టిన యట్టు |
వేళతో మామనువులు విన్నవించితిమి నీకు |
ఏల నిద్దిరించేవు మమ్మిట్టే రక్షించరాద ||
చ|| ద్వారకా నగరములో తగ నెత్తమాడే నీకు |
బిరాన ద్రౌపది మొరవెట్టిన యట్టు |
ఘోరపు రాజసభల కుంది విన్నవించితిమి |
ఏరీతి పరాకు నీకు నింక రక్షించరాద ||
చ|| ఎనసి వైకుంఠములో నిందిర గూడున్న నీకు |
పెనగి గజము మొరవెట్టిన యట్టు |
చనువుతో మాకోరికె సారె విన్నవించితిమి |
విని శ్రీవేంకటేశుండ వేగ రక్షించరాద ||
pa|| nIdAsula BaMgamulu nIvujUturA |
Edani jUcEvu nIku neccariMcavalenA ||
ca|| pAla samudramu mIda pavvaLiMccinaTTi nIku |
bElalai suralu moraveTTina yaTTu |
vELatO mAmanuvulu vinnaviMcitimi nIku |
Ela niddiriMcEvu mammiTTE rakShiMcarAda ||
ca|| dvArakA nagaramulO taga nettamADE nIku | birAna draupadi moraveTTina yaTTu |
GOrapu rAjasaBala kuMdi vinnaviMcitimi | ErIti parAku nIku niMka rakShiMcarAda ||
ca|| enasi vaikuMThamulO niMdira gUDunna nIku | penagi gajamu moraveTTina yaTTu |
canuvutO mAkOrike sAre vinnaviMcitimi | vini SrIvEMkaTESuMDa vEga rakShiMcarAda ||