త్యా,క్ర,క్ష,త్ర లాంటి సంక్లిష్ఠ అక్షరల ప్రాసతో కూడిన ఈ కీర్త న చరణాలను అన్నమయ్య ఎలా కూర్చారో చూడండి.
ప : నమో నారాయణాయ నమో నారాయణాయ
అప :నారాయణాయ సగుణబ్రహ్మణే సర్వ పారాయణాయ శోభనమూర్త యే నమో
నిత్యాయ విభుధసంస్తు త్యాయ నిత్యాధి
పత్యాయ మునిగణ ప్రత్యయాయ
సత్యాయ ప్రత్యక్షాయ సన్మానససాం
గత్యాయ జగదావనకృత్యాయతే నమో
అక్రమోద్ధతబాహువిక్రమాతిక్రాంత
శుక్రశిష్యోన్మూలనక్రమాయ
శక్రాదిగీర్వాణవక్రభయభంగని
ర్వక్రాయ నిహతారిచక్రాయ తే నమో
అక్షరాయాతినిరపేక్షాయ పుండరీ
కాక్షాయ శ్రీవత్సలక్షణాయ
అక్షీణవిజ్ఞానదక్షయోగీంద్రసం
రక్షానుకంపాకటాక్షాయ తే నమో
కరిరాజవరదాయ కౌస్తు భాభరణాయ
మురవైరిణే జగన్మోహనాయ
తరుణేందుకోటిరతరుణీ మనస్తో త్ర
పరితోషచిత్తా య పరమాయతే నమో
పాత్రదానోత్సవప్రథిత వేంకటరాయ
ధాత్రీశకామితార్థప్రదాయ
గోత్రభిన్మణిరుచిరగాత్రాయ రవిచంద్ర
నేత్రాయ శేషాద్రినిలయాయ తేనమో
Sung by:Balakrishna Prasad
|