ఒసగితివిన్నియు ఒకమాటే
వెసనిక జేసే విన్నపమేది
నారాయణా నీనామము దలచిన -
నీరాని వరములిచ్చితివి
చేరి నిన్ను నిటు సేవించిననిక
గోరి పడయ నిక కోరికలేవి
హరి నీకొకమరి యటు శరణంటే
గరిమల నన్నిటు గాచితివి
నిరతముగా నిక నిను నుతియింపుచు
అరగొరతనివి నిను నడిగేదేదో
శ్రీవేంకటేశ్వర చేయెత్తి మొక్కిన
భావమే నీవై పరగితివి
యీవరుసల నీవింతటిదాతవు
ఆవలనిను కొనియాడెడిదేమి
osagitivinniyu okamATE
vesanika jEsE vinnapamEdi
nArAyaNA nInAmamu dalachina -
nIrAni varamulichchitivi
chEri ninnu niTu sEviMchinanika
gOri paDaya nika kOrikalEvi
hari nIkokamari yaTu SaraNaMTE
garimala nanniTu gAchitivi
niratamugA nika ninu nutiyiMpuchu
aragoratanivi ninu naDigEdEdO
SrIvEMkaTESwara chEyetti mokkina
bhAvamE nIvai paragitivi
yIvarusala nIviMtaTidAtavu
Avalaninu koniyADeDidEmi
Sung by:Balakrishna Prasad
osagitivinniyu okamATE
4:14 AM
O - Annamayya