రామ రామ రామ కృష్ణ రాజీవలోచన నీకు
దీము వంటి బంటననే తేజమే నాది
వారిధి దాటి మెప్పించ వాయుజుడనే గాను
సారె చవుల మెప్పించ శబరినే గాను
బీరాన సీత నిచ్చిమె ప్పించ జనకుడగాను
ఏరీతి మెప్పింతునో న న్నెట్లాగాచేవో
ఘనమై మోచి మెప్పించ గరుడుడనే గాను
కొని కామసుఖమిచ్చు గోపికనే గాను
వినుతించి మెప్పించ వేయినోళ్ళ భోగిగాను
నిను నెట్లు మెప్పింతు ననుగాచే దెట్లా
నవ్వుచు పాడి మెప్పించ నారదుడనే గాను
అవ్వల ప్రాణమియ్య జటాయువు గాను
ఇవ్వల శ్రీవేంకటేశ ఇటునీకే శరణంటి
రవ్వల నా తెలివిచే రక్షించే దెట్లా
rAma rAma rAma kRShNa rAjIvalOchana nIku
dImu vaMTi bamTananE tEjamE nAdi
vAridhi dATi meppimcha vAyujuDanE gAnu
sAre chavula meppiMcha SabarinE gAnu
bIrAna sIta nichchime ppiMcha janakuDagAnu
ErIti meppiMtunO na nneTlAgAchEvO
ghanamai mOchi meppiMcha garuDuDanE gAnu
koni kAmasukhamichchu gOpikanE gAnu
vinutiMchi meppiMcha vEyinOLLa bhOgigAnu
ninu neTlu meppiMtu nanugAchE deTlA
navvuchu pADi meppiMcha nAraduDanE gAnu
avvala prANamiyya jaTAyuvu gAnu
ivvala SrIvEMkaTESa iTunIkE SaraNaMTi
ravvala nA telivichE rakshiMchE deTlA
Sung by:Nedunuri Krishnamurthy