రామునికి శరణంటే రక్ష్మించీ బ్రతుకరో
యేమిటికి విచారాలు యిక దైత్యులాల
చలమున తాటకి జదిపిన బాణము
లలి మారీచసుబాహులపై బాణాము
మెలగి పరశురాము మేట్లేసిన బాణము
తళతళ మెరసీని తలరో యసురులు
మాయామృగము మీద మరి వేసిన బాణము
చేయిచాచి వాలి నేసిన బాణాము
తోయధిమీద నటు తొడిగిన బాణము
చాయలు దేరుచున్నది చనరో దైత్యేయులు
తగ కుంభకర్ణుని తల ద్రుంచిన బాణము
జిగి రావణు పరిమార్చిన బాణము
మిగుల శ్రీవేంకటేశు మేటిపొద(ది) లో నున్నది
పగ సాధించీ నిక బారరో రాకాసులు
rAmuniki SaraNaMTE rakshmiMchI bratukarO
yEmiTiki vichArAlu yika daityulAla
chalamuna tATaki jadipina bANamu
lali mArIchasubAhulapai bANAmu
melagi paraSurAmu mETlEsina bANamu
taLataLa merasIni talarO yasurulu
mAyAmRgamu mIda mari vEsina bANamu
chEyichAchi vAli nEsina bANAmu
tOyadhimIda naTu toDigina bANamu
chAyalu dEruchunnadi chanarO daityEyulu
taga kuMbhakarNuni tala druMchina bANamu
jigi rAvaNu parimArchina bANamu
migula SrIvEMkaTESu mETipoda(di) lO nunnadi
paga sAdhiMchI nika bArarO rAkAsulu
rAmuniki SaraNaMTE - Annamayya/annamacarya lyrics/spiritual/devotional/traditional/top songs/videos/telugu/english
4:03 AM
R - Annamayya