sakala saMgrahamu sakala saMcayamu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english


ప|| సకల సంగ్రహము సకల సంచయము |
అకృతసుకృత మిది హరినామం ||

చ|| సకలవేదశాస్త్రములసార మిది|
సకలమంత్రరాజంబు నిది|
సకలపురాణ రసములమధుర మిది|
అకుటిలపావనం హరినామం ||



చ|| సకలతత్త్వ సంశయఖండన మిది |
సకలకర్మ నిశ్చయము నిది |
సకలవిధి రహస్యప్రధాన మిది |
అకారణహితం హరినామం ||

చ|| సకలదేవతా స్వామిప్రియం బిది |
సకలలోక రక్షణము నిది |
ప్రకటం వేంకటపతి నామాంకిత- |
మకించనధనం హరినామం ||



pa|| sakala saMgrahamu sakala saMcayamu |
akRtasukRta midi harinAmaM ||
ca|| sakalavEdaSAstramulasAra midi |
sakalamaMtrarAjaMbu nidi |
sakalapurANa rasamulamadhura midi |
akuTilapAvanaM harinAmaM ||
ca|| sakalatattva saMSayaKaMDana midi |
sakalakarma niScayamu nidi |
sakalavidhi rahasyapradhAna midi |
akAraNahitaM harinAmaM ||
ca|| sakaladEvatA svAmipriyaM bidi |
sakalalOka rakShaNamu nidi |
prakaTaM vEMkaTapati nAmAMkita- |
makiMcanadhanaM harinAmaM ||



Get this widget | Track details | eSnips Social DNA