సందెకాడ బుట్టినట్టి చాయల పంట
యెంత-చందమాయ చూడరమ్మ చందమామ పంట॥
..
మునుప పాలవెల్లి మొలచి పండినపంట
నినుపై దేవతలకు నిచ్చపంట
గొనకొని హరికన్ను గొనచూపులపంట
వినువీధి నెగడిన వెన్నెలల పంట॥
..
వలరాజు పంపున వలపు విత్తిన పంట
చలువై పున్నమనాటి జాజరపంట
కలిమి కామిని తోడ కారుకమ్మినపంట
మలయుచు తమలోని మర్రిమాని పంట॥
..
విరహుల గుండెలకు వెక్కసమైన పంట
పరగచుక్కలరాసి భాగ్యము పంట
అరుదై తూరుపుకొండ నారగబండినపంట
యిరవై శ్రీ వేంకటేశునింటిలోని పంట॥
|
|
ఐవి. సీతాపతిగారి వ్యాఖ్యానం menaing provided by telugubhatki.com