SaraNaMbitaDE sakalamu nAkunu - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english


ప|| శరణంబితడే సకలము నాకును |
వెరవున మనసా వెతకవో ఇతని ||

చ|| అభయంబొసగెడి యతడెవ్వడు మును |
ఇభరక్షకుడు అతడెవ్వడు |
ఉభయవిభూతుల కొడయండెవడూ |
ప్రభువితడే నాపాలి దేవుడు ||

చ|| శరణాగతులకు సరి దా నెవ్వడు |
యిరవుగ శ్రీపతి యెవ్వడు |
అరి దుష్ట దైత్య హంతకు డెవ్వడు |
పరమును నతడె నాపాలి దేవుడు ||

చ|| ఆది శంఖ చక్రాయుధు డెవ్వడు |
యేదెస పూర్ణు డెవ్వడు |
వేదమయుడు శ్రీ వేంకట పతియై |
పాదాయ నిదె నా పాలిదేవుడు ||


pa|| SaraNaMbitaDE sakalamu nAkunu |

veravuna manasA vetakavO itani ||



ca|| aBayaMbosageDi yataDevvaDu munu |

iBarakShakuDu ataDevvaDu |


uBayaviBUtula koDayaMDevaDU |

praBuvitaDE nApAli dEvuDu ||



ca|| SaraNAgatulaku sari dA nevvaDu |

yiravuga SrIpati yevvaDu |


ari duShTa daitya haMtaku DevvaDu |

paramunu nataDe nApAli dEvuDu ||



ca|| Adi SaMKa cakrAyudhu DevvaDu |

yEdesa pUrNu DevvaDu |


vEdamayuDu SrI vEMkaTa patiyai |

pAdAya nide nA pAlidEvuDu ||


Get this widget | Track details | eSnips Social DNA