Sevimparo janulala - సేవింపరో జనులాల
Sevimparo janulala - సేవింపరో జనులాల | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English
Listen Audio by G BALAKRISHNA PRASAD:
ప॥ సేవింపరో జనులాల చేరి మొక్కరో
భావింప నున్నాఁడిందరి భాగ్యమువలెను
చ॥ జలకమాడి వున్నాఁడు సర్వేశ్వరుఁడు నిగ్గుఁ
గలిగిన మంచినల్ల కలువవలె
యెలమిఁ గప్పురకాపు ఇదె చాతుకున్నవాఁడు
వెలలేనియట్టి పెద్దవెండికొండవలెను
చ॥ అందముగఁ దట్టుపుణుఁ గలదుక వున్నవాఁడు
కలదున ఇంద్రనీలాలగనివలెను
ముందరివలెనే తా సొమ్ములు నించుకున్నవాఁడు
పొందిన సంపదలకు పుట్టినిల్లువలెను
చ॥ మించి యలమేలుమంగ మెడఁ గట్టుకున్నవాఁడు
పొంచి బంగారుతామెరపువ్వువలెను
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డిదె కొలువై వున్నవాఁడు
నించిన దాసులపాలి నిధానము వలెను
pa||saeviMparO janulaala chaeri mokkarO
bhaaviMpa nunnaa@MDiMdari bhaagyamuvalenu
cha|| jalakamaaDi vunnaa@MDu sarvaeSvaru@MDu niggu@M
galigina maMchinalla kaluvavale
yelami@M gappurakaapu ide chaatukunnavaa@MDu
velalaeniyaTTi peddaveMDikoMDavalenu
cha|| aMdamuga@M daTTupuNu@M galaduka vunnavaa@MDu
kaladuna iMdraneelaalaganivalenu
muMdarivalenae taa sommulu niMchukunnavaa@MDu
poMdina saMpadalaku puTTinilluvalenu
cha|| miMchi yalamaelumaMga meDa@M gaTTukunnavaa@MDu
poMchi baMgaarutaamerapuvvuvalenu
yeMcha@Mga SreevaeMkaTaeSu@M Dide koluvai vunnavaa@MDu
niMchina daasulapaali nidhaanamu valenu