శ్రావణ బహుళాష్టమి జయంతి నేడు
సేవించరో జనులాల శ్రీకృష్ణుడితడు
భావింప వసుదేవుని పాలిటభాగ్యదేవత
దేవకిగనినయట్టి దివ్యరత్నము
చేవమీర సురల రక్షించే కల్పతరువు
యీవేళ జన్మించినాడు యిదె కృష్ణుడు
హరవిరంచాదులకు నాదిమూలకారణము
పరమమునుల తపఃఫలసారము
గరుడోరగేంద్రులకు కలిగిన నిధానము
యిరవుగా నుదయించె నిదె కృష్ణుడు
బలు యోగీశ్వరుల బ్రహ్మానందము
చెలగు భాగవతుల చింతామణి
అలమేల్మంగకు పతి యట్టె శ్రీవేంకటాద్రి
నిలపై జన్మించినాడు యిదె కృష్ణుడు
SrAvaNa bahuLAshTami jayaMti nEDu
sEviMcharO janulAla SrIkRshNuDitaDu
bhAviMpa vasudEvuni pAliTabhAgyadEvata
dEvakiganinayaTTi divyaratnamu
chEvamIra surala rakshiMchE kalpataruvu
yIvELa janmiMchinADu yide kRshNuDu
haraviraMchAdulaku nAdimUlakAraNamu
paramamunula tapa@hphalasAramu
garuDOragEMdrulaku kaligina nidhAnamu
yiravugA nudayiMche nide kRshNuDu
balu yOgISwarula brahmAnaMdamu
chelagu bhAgavatula chiMtAmaNi
alamElmaMgaku pati yaTTe SrIvEMkaTAdri
nilapai janmiMchinADu yide kRshNuDu
SrAvaNa bahuLAshTami - Annamayya/annamacarya lyrics/spiritual/devotional/traditional/top songs/Audio/videos/telugu/english
7:53 AM
S - Annamayya