ప||
తొల్లింటి వలె గావు తుమ్మెదా యింక | వొల్లవుగా మమ్మువో తుమ్మెదా ||
చ||
తోరంపు రచనల తుమ్మెదా కడు | దూరేవు గొందులే తుమ్మెదా |
దూరినా నెఱుగవు తుమ్మెదా మమ్ము | వోరగా చూడకు వో తుమ్మెదా ||
చ||
తొలి ప్రాయపు మిండ తుమ్మెదా కడు | తొలిచేవు చేగలే తుమ్మెదా |
తొలకరి మెరుగువే తుమ్మెదా ఇంక | ఉలికేవు మముగని వో తుమ్మెదా ||
చ||
దొరవు వేంకటగిరి తుమ్మెదా మా | తురుమేల చెనకేవు తుమ్మెదా |
దొరకెనీ చనవులు తుమ్మెదా ఇంక | ఒరులెఱింగిరి గదవో తుమ్మెదా ||
pa||
tolliMTi vale gAvu tummedA yiMka | vollavugA mammuvO tummedA ||
ca||
tOraMpu racanala tummedA kaDu | dUrEvu goMdulE tummedA |
dUrinA nerxugavu tummedA mammu | vOragA cUDaku vO tummedA ||
ca||
toli prAyapu miMDa tummedA kaDu | tolicEvu cEgalE tummedA |
tolakari meruguvE tummedA iMka | ulikEvu mamugani vO tummedA ||
ca||
doravu vEMkaTagiri tummedA mA | turumEla cenakEvu tummedA |
dorakenI canavulu tummedA iMka | orulerxiMgiri gadavO tummedA ||
Sung by:Balakrishna Prasad Get this widget | Track details | eSnips Social DNA
tolliMTi vale gAvu tummedA - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english
6:39 AM
T - Annamayya