ప|| తెలిసినవారికి దేవుండితడే | వలవని దుష్టుల వాదములేల ||
చ|| పురుషులలోపల పురుషోత్తముడు | నరులలోన నరనారాయణుడు |
పరదైవములకు పరమేశ్వరుడు | వరుసమూఢుల కెవ్వరోయితడు ||
చ|| పలుబ్రహ్మలకును పరబ్రహ్మము | మలయునీశులకు మహేశుడితడు |
ఇలనాత్మలలో నిటుపరమాత్ముడు | ఖలులకెట్లుండునో కానము యితడు ||
చ|| వేదంబులలో వేదాంతవేద్యుడు | సోదించకరిగాచుచో నాదిమూలము |
ఈదెస శ్రీవేంకటేశుడిందరికి | గాదిలిమతులను గైకొనడితడు ||
pa|| telisinavAriki dEvuMDitaDE | valavani duShTula vAdamulEla ||
ca|| puruShulalOpala puruShOttamuDu | narulalOna naranArAyaNuDu |
paradaivamulaku paramESvaruDu | varusamUDhula kevvarOyitaDu ||
ca|| palubrahmalakunu parabrahmamu | malayunISulaku mahESuDitaDu |
ilanAtmalalO niTuparamAtmuDu | KalulakeTluMDunO kAnamu yitaDu ||
ca|| vEdaMbulalO vEdAMtavEdyuDu | sOdiMcakarigAcucO nAdimUlamu |
Idesa SrIvEMkaTESuDiMdariki | gAdilimatulanu gaikonaDitaDu ||