తెలిసితేమోక్షము - తెలియకున్న బంధము
కలవంటిది బదుకు -ఘనునికిని
అనయము సుఖమేడ -దవల దు:ఖమేడది
తనువుపై నాసలేని - తత్వమతికి
పొనిగితే బాపమేది -పుణ్యమేది కర్మమందు
వొనర ఫలమొల్లవి - యోగికిని
తగినయమృతమేది - తలవగ విషమేది
తెగి నిరాహారియైన - ధీరునికిని
పగవారనగ వేరి - బంధులనగ వేరీ
వెగటుప్రపంచమెల్ల - విడిచేవివేకికి
వేవేలువిధులందు - వెఱపేది మఱపేది
దైవము నమ్మినయట్టి - ధన్యునికిని
శ్రీవేంకటేశ్వరుడు - చిత్తములో నున్నవాడు
యీవలేది యావలేది - యితనిదాసునికి
telisitaemOkshamu - teliyakunna baMdhamu
kalavaMTidi baduku -ghanunikini
anayamu sukhamaeDa -davala du:khamaeDadi
tanuvupai naasalaeni - tatvamatiki
ponigitae baapamaedi -puNyamaedi karmamaMdu
vonara phalamollavi - yOgikini
taginayamRtamaedi - talavaga vishamaedi
tegi niraahaariyaina - dheerunikini
pagavaaranaga vaeri - baMdhulanaga vaeree
vegaTuprapaMchamella - viDichaevivaekiki
vaevaeluvidhulaMdu - ve~rapaedi ma~rapaedi
daivamu namminayaTTi - dhanyunikini
SreevaeMkaTaeSvaruDu - chittamulO nunnavaaDu
yeevalaedi yaavalaedi - yitanidaasuniki
sung by: Malladi brothers, tuned by:Sri Nedunuri krishnamurthy