ప|| ఉగ్గువెట్టరే వోయమ్మా | చేయ్యొగ్గీ నిదె శిశువోయమ్మా ||
చ|| కడుపులోని లోకమ్ములు గదిలీ | నొడలూచకురే వోయమ్మా |
తొడికెడి సరగున తొలగదీయరే | పుడికెడి పాలివి వోయమ్మా ||
చ|| చప్పలు పట్టుక సన్నపు బాలుని | నుప్పర మెత్తకు రోయమ్మా |
అప్పుడె సకలము నదిమీ నోరనె | వొప్పదు తియ్యరె వోయమ్మా ||
చ|| తొయ్యలు లిటు చేతుల నలగించక | వుయ్యల నిడరే వోయమ్మా |
కొయ్యమాటలను కొండల తిమ్మని | వొయ్యన తిట్టకు రోరమ్మా ||
pa|| ugguveTTarE vOyammA | cEyyoggI nide SiSuvOyammA ||
ca|| kaDupulOni lOkammulu gadilI | noDalUcakurE vOyammA |
toDikeDi saraguna tolagadIyarE | puDikeDi pAlivi vOyammA ||
ca|| cappalu paTTuka sannapu bAluni | nuppara mettaku rOyammA |
appuDe sakalamu nadimI nOrane | voppadu tiyyare vOyammA ||
ca|| toyyalu liTu cEtula nalagiMcaka | vuyyala niDarE vOyammA |
koyyamATalanu koMDala timmani | voyyana tiTTaku rOrammA ||