ప|| విశ్వప్రకాశునకు వెలియేడ లో నేడ శాశ్వతునకు కూహింప జన్మ మిక నేడ
చ|| సర్వపరిపూర్ణునకు సంచార మిక నేడ నిర్వాణమూర్తికిని నిలయ మిక నేడ
వుర్వీధరునకు గాలూద నొకచోటేడ పార్వతీస్తుత్యునకు భావ మిక నేడ
చ|| నానాప్రభావునకు నడుమేడ మొదలేడ ఆననసహస్రునకు నవ్వలివ్వలేడ
మౌనిహౄదయస్థునకు మాటేడ పలుకేడ జ़్జానస్వరూపునకు గాన విన నేడ
చ|| పరమయోగీంద్రునకు పరులేడ తానేడ దురితదూరునకు సంస్తుతినింద లేడ
తిరువేంకటేశునకు దివ్యవిగ్రహమేడ హరికి నారాయణున కవుగాములేడ
pa|| viSvaprakASunaku veliyEDa lO nEDa SASvatunaku kUhiMpa janma mika nEDa
ca|| sarvaparipUrNunaku saMcAra mika nEDa nirvANamUrtikini nilaya mika nEDa
vurvIdharunaku gAlUda nokacOTEDa pArvatIstutyunaku BAva mika nEDa
ca|| nAnApraBAvunaku naDumEDa modalEDa Ananasahasrunaku navvalivvalEDa
maunihRudayasthunaku mATEDa palukEDa j~jAnasvarUpunaku gAna vina nEDa
ca|| paramayOgIMdrunaku parulEDa tAnEDa duritadUrunaku saMstutiniMda lEDa
tiruvEMkaTESunaku divyavigrahamEDa hariki nArAyaNuna kavugAmulEDa
Sung by:Balakrishna Prasad
Sung by:Dr Pasupati
Sung by:Balakrishna Prasad
|
Sung by:Dr Pasupati
|