ప|| విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో |
శాశ్వతులమైతిమింక జయము నాజన్మము ||
చ|| కొండవంటి హరిరూపు గురుతైనతిరుమల |
పండిన వృక్షములే కల్పతరువులు |
నిండిన మృగాదులెల్ల నిత్యముక్త జనములు |
మెండుగ ప్రత్యక్షమాయె మేలువో నాజన్మము ||
చ|| మేడవంటి హరిరూపు మించైన పైడిగోపురము |
ఆడనే వాలిన పక్షులమరులు ||
వాడల కోనేటిచుట్ల వైకుంఠ నగరము |
ఈడమాకు పొడచూపె ఇహమేపో పరము ||
చ|| కోటిమదనులవంటి గుడిలో చక్కనిమూర్తి |
ఈటులేని శ్రీవేంకటేశుడితదు |
వాటపు సొమ్ములు ముద్ర వక్షపుటలమేల్మంగ |
కూటువైనన్నేలితి యెక్కువవో నాతపము ||
pa|| viSvarUpamidivO viShNurUpamidivO |
SASvatulamaitimiMka jayamu nAjanmamu ||
ca|| koMDavaMTi harirUpu gurutainatirumala |
paMDina vRkShamulE kalpataruvulu |
niMDina mRgAdulella nityamukta janamulu |
meMDuga pratyakShamAye mEluvO nAjanmamu ||
ca|| mEDavaMTi harirUpu miMcaina paiDigOpuramu |
ADanE vAlina pakShulamarulu ||
vADala kOnETicuTla vaikuMTha nagaramu | I
DamAku poDacUpe ihamEpO paramu ||
ca|| kOTimadanulavaMTi guDilO cakkanimUrti | I
TulEni SrIvEMkaTESuDitadu |
vATapu sommulu mudra vakShapuTalamElmaMga |
kUTuvainannEliti yekkuvavO nAtapamu ||
Sung by:Nitya santoshini
viSvarUpamidivO viShNurUpamidivO - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english
5:49 AM
V- Annamayya