ఎంత చదివి చూచిన నీతడే ఘనము గాక| యింతయు నేలేటి దైవమిక వేరే కలరా||
మొదల జగములకు మూలమైన వాడు| తుద ప్రళయము నాడు తోచేవాడు||
కదిసి నడుమనిండి కలిగి వుండెడి వాడు| మదన గురుడే కాక మరి వేరే కలరా||
పరమాణువైనవాడు బ్రహ్మాండమైనవాడు| సురలకు నరులకు జోటయిన వాడు||
పరమైన వాడు ప్రపంచమైనవాడు| హరి యొక్కడే కాక అవ్వలను గలరా||
పుట్టుగులయినవాడు భోగ మోక్షాలయినవాడు| యెట్టనెదురలోనను యిన్నిటివాడే||
గట్టిగా శ్రీవేంకటాద్రి కమలాదేవితోడి| పట్టపు దేవుడే కాక పరులిక గలరా||
eMta cadivi cUcina nItaDE ghanamu gAka| yiMtayu nElETi daivamika vErE kalarA||
modala jagamulaku mUlamaina vADu| tuda praLayamu nADu tOcEvADu||
kadisi naDumaniMDi kaligi vuMDeDi vADu| madana guruDE kAka mari vErE kalarA||
paramANuvainavADu brahmAMDamainavADu| suralaku narulaku jOTayina vADu||
paramaina vADu prapaMcamainavADu| hari yokkaDE kAka avvalanu galarA||
puTTugulayinavADu bhOga mOkShAlayinavADu| yeTTaneduralOnanu yinniTivADE||
gaTTigA SrIvEMkaTAdri kamalAdEvitODi| paTTapu dEvuDE kAka parulika galarA||