కానీవే అందుకేమీ కనుకొనే పను లెల్ల
యీ నాటకములు నేనెఱగనివా
పంతము లాడిన తానే భ్రమసీ గాక నాకు
యింతలోనే యేమి దప్పె నెందు వోయీని
వింత యడవుల వెంట వెదకడా సీతఁదొల్లి
యెంత లేదు తనగుండె యెఱగనిదా
బిగియుచున్న వాడే బిలిచీగాక నన్ను
తగవులే నెరపేను దాని కేమే
వెగటయి రాధాదేవివెంట తిరుగడా
యెగువనె తనగుట్టు యెఱగనిదా
కడలనున్న వాడే కలసీగాక నన్ను
తడవకు వాని నిట్టె తతి రానీవే
అడరి శ్రీవేంకటేశ్వరుడట్టె నన్ను గలసె
యెడయకున్నాడు నే నిది యెఱగనిదా
ca||kAnIvE aMdukEmI kanukonE panu lella
yI nATakamulu nEne~raganivA
pa||Mtamu lADina tAnE bhramasI gAka nAku
yiMtalOnE yEmi dappe neMdu vOyIni
viMta yaDavula veMTa vedakaDA sIta@Mdolli
yeMta lEdu tanaguMDe ye~raganidA
bigiyuchunna vADE bilichIgAka nannu
tagavulE nerapEnu dAni kEmE
vegaTayi rAdhAdEviveMTa tirugaDA
yeguvane tanaguTTu ye~raganidA
kaDalanunna vADE kalasIgAka nannu
taDavaku vAni niTTe tati rAnIvE
aDari SrIvEMkaTESwaruDaTTe nannu galase
yeDayakunnADu nE nidi ye~raganidA