ఏటి బ్రదుకు యేటి బ్రదుకు ! వొక్క -
మాట లోనే యటమటమైన బ్రదుకు
సంతకూటములే చవులయిన బ్రదుకు
దొంతిభయములతోడి బ్రదుకు
ముంతనీళ్ళనే మునిగేటి బ్రదుకు
వంతఁ బొరలి కడవర(ల)లేని బ్రదుకు
మనసుచంచలమే మనువయిన బ్రదుకు
దినదినగండాలఁ దీరు బ్రదుకు
తనియ కాసలనె తగిలేటి బ్రదుకు
వెనక ముందర చూడ వెరపయిన బ్రదుకు
తెగి చేదెతీపయి తినియేటి బ్రదుకు
పగవారి పంచల పాలైన బ్రదుకు
తగువేంకటేశ్వరుఁ దలచని బ్రదుకు
పొగకు నోపక మంటఁ బొగిలేటి బ్రదుకు
ETi braduku yETi braduku ! vokka -
mATa lOnE yaTamaTamaina braduku
saMtakUTamulE chavulayina braduku
doMtibhayamulatODi braduku
muMtanILLanE munigETi braduku
vaMta@M borali kaDavara(la)lEni braduku
manasuchaMchalamE manuvayina braduku
dinadinagaMDAla@M dIru braduku
taniya kAsalane tagilETi braduku
venaka muMdara chUDa verapayina braduku
tegi chEdetIpayi tiniyETi braduku
pagavAri paMchala pAlaina braduku
taguvEMkaTESwaru@M dalachani braduku
pogaku nOpaka maMTa@M bogilETi braduku
Sung by: R Viswanath