తలచిన తలపులుఁ దలకూడె
వెలుపలె లోపలె వెరగికనేలే
వలచిన వలపులు వడ్డికి బారీ
తలుపుఁదెరవవే తరుణి యిక
పిలువక వచ్చెను ప్రియుడు వాకిటికి
నిలువుల బిగువులు నీ కిక నేలే
ముసి ముసి నగవులు మోవులనుండగ
ముసుగిడనేలే ముదిత యిక
రసములు గురిసీ రమణుడు నీతో
దొసగుల సుద్దులు తుదనికనేలే
కరగిన చెమటలు కాగిట నున్నవి
నిరతి మరగేలే నెలత యిక
యిరవుగ శ్రీ వెంకటేశుడు గూడెను
ధరలో గొంటివి తడబాటేలే
talachina talapulu@M dalakooDe
velupale lOpale veragikanaelae
valachina valapulu vaDDiki baaree
talupu@Mderavavae taruNi yika
piluvaka vachchenu priyuDu vaakiTiki
niluvula biguvulu nee kika naelae
musi musi nagavulu mOvulanuMDaga
musugiDanaelae mudita yika
rasamulu gurisee ramaNuDu neetO
dosagula suddulu tudanikanaelae
karagina chemaTalu kaagiTa nunnavi
nirati maragaelae nelata yika
yiravuga Sree veMkaTaeSuDu gooDenu
dharalO goMTivi taDabaaTaelae
Sung by:Sri Mangalampalli Balamuralikrishna